మహేష్,త్రివిక్రమ్ చిత్రం, షాకిచ్చే రేటుకు ఓటిటి రైట్స్
థియేట్రికల్ విడుదల తర్వాత తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమాను తమ ఓటీటీ వేదికలో విడుదల చేయనున్నట్లు తెలియజేసింది.

మహేష్ బాబు, త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ ఎస్‌ఎస్‌ఎంబీ 28. మహేష్ కెరీర్‌లో 28వ సినిమాగా వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. అతడు, ఖలేజా తర్వాత ఈ ఇద్దరూ కలిసి చేస్తున్న మూడో సినిమా ఇది. అందులోనూ 11 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి మూవీ చేస్తుండటంతో ఇది పక్కా బంపర్ హిట్ అని అభిమానులు ఓ అంచనాకు వచ్చేశారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం బిజినెస్ ఆల్రెడీ ప్రారంభమైపోయింది.
అందుతున్న సమాచారం మేరకు #SSMB28 ఓటిటి రైట్స్ కు భారీ ధర పలికింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్నట్లు ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ కొన్ని రోజుల క్రితం వెల్లడించింది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ 80 కోట్ల రూపాయలు పలికినట్లు, ఇది అన్ని భాషలకు కలిపి అని సమాచారం. థియేట్రికల్ విడుదల తర్వాత తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమాను తమ ఓటీటీ వేదికలో విడుదల చేయనున్నట్లు తెలియజేసింది.
మరో ప్రక్క నైజాం రైట్స్ దిల్ రాజు 50 కోట్లకు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. మరో ప్రక్క ఏషియన్ సునీల్ సిండికేట్...48 కోట్లు ఆఫర్ చేసారని, నెగోషియేషన్స్ జరుగుతున్నాయని ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది. మరి ఎవరికి ఈ చిత్రం రైట్స్ వెళ్లబోతున్నాయనేది తెలియాల్సి ఉంది. అయితే ముందుగా భావించినట్లు ఈ సినిమాను సమ్మర్‌లో రిలీజ్ చేసే అవకాశాలు కనిపించడం లేదు.
మహేష్ చెప్పినట్లు స్క్రిప్ట్‌లో మార్పులు చేసి, షూటింగ్ ఆలస్యం కావడంతో వచ్చే ఏడాది దసరాకు ఈ సినిమాను ప్రేక్షకులు ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు. త్రివిక్రమ్ ఎలాగైనా పెద్ద హిట్ కొట్టాలని చూస్తున్నారు. తన మార్క్ ఎమోషనల్ డ్రామాతో ఈసారి కూడా ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడానికి త్రివిక్రమ్ సిద్ధమవుతున్నాడు. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ తర్వాత మహేష్ ఎలాగూ రాజమౌళితో హై యాక్షన్ ఎంటర్‌టైనర్ చేయనున్నాడు. ఈ సినిమాలో మహేస్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా.. మహేష్ పూర్తిగా ఓ కొత్త లుక్‌లో కనిపించబోతున్నాడు.
ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కూర్పు: నవీన్ నూలి, కళా దర్శకత్వం: ఏ.ఎస్. ప్రకాష్, ఛాయాగ్రహణం: పి.ఎస్. వినోద్.