'జాతి రత్నం' తో మహేష్ సినిమా, డిటేల్స్

 ఇప్పటికే మహేష్ బాబు నిర్మాణ సంస్థలో వరుసగా సినిమాలు పట్టాలెక్కుతున్నాయి. మొదటిగా అడవి శేష్ హీరోగా మేజర్ సినిమా తెరకెక్కింది. ఆ సినిమా షూటింగ్ ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సినిమా తర్వాత యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి తో ఓ సినిమాను నిర్మించనున్నారని సమాచారం. 
 

Mahesh Babu To Produce Naveen Polishetty movie jsp

మహేష్ బాబు హీరోగానే కాకుండా నిర్మాతగానూ పూర్తి స్దాయిలో బిజీ అవుతున్నారు. ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్నసూపర్ స్టార్ మహేష్ బాబు తన తదుపరి చిత్రాలకు కథలు విని ఓకే చేయటమే కాకుండా, తన బ్యానర్ లో రూపొందించబోయే సినిమాల కథల సెలక్షన్ చూస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే మహేష్ బాబు నిర్మాణ సంస్థలో వరుసగా సినిమాలు పట్టాలెక్కుతున్నాయి. మొదటిగా అడవి శేష్ హీరోగా మేజర్ సినిమా తెరకెక్కింది. ఆ సినిమా షూటింగ్ ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సినిమా తర్వాత యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి తో ఓ సినిమాను నిర్మించనున్నారని సమాచారం. 

ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు నవీన్ పొలిశెట్టి ని హీరోగా పెట్టి ఒక సినిమాను మహేష్ బాబు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారనే వార్తలు మీడియాలో వస్తున్నాయి. వీర శేఖర్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతో పరిచయం కానున్నాడు. ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇప్పటికే పూర్తయ్యాయి.  

 ఏజెంట్ సాయి శ్రీనివాస్ సినిమాతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ప్రస్తుతం ‘జాతి రత్నాలు’ అనే సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తి అయిన వెంటనే మహేష్ బాబు బ్యానర్ లో సినిమాను చేసేందుకు సిద్దం అవుతున్నాడు. అతి త్వరలోనే సినిమాకు సంబంధించిన ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇక మహేష్ ..సర్కారు వారి పాట విషయానికి వస్తే... పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అందాల భామ కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ జనవరి నుంచి మొదలు కాబోతుంది. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ వంశీ పైడిపల్లితో సినిమా చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు మెగాస్టార్ మూవీ టైటిల్ ‘స్టేట్ రౌడీ’ను కూడా అనుకుంటున్నారని ప్రచారం జరుగుతుంది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios