సూపర్ స్టార్ మహేష్ బాబు  సినీ నటుడుగా ఫుల్ ఫామ్ లో ఉన్నారు. మరో ప్రక్క యాడ్స్ చేస్తూ చాలా బిజీగా ఉంటున్నారు. మధ్య మధ్యలో ఆయన రీసెంట్ గా పెట్టిన ఎఎంబి మల్టిప్లెక్స్ వ్యవహారాలు చూస్తున్నారు. అంతేకాదు తన తండ్రి కృష్ణగారిలా ఇక్కడ సంపాదించిన సొమ్ముని ఇక్కడే పెట్టాలన్నట్లుగా సొంత ప్రొడక్షన్ హౌస్ పెట్టి సినిమాల నిర్మాణం మొదలెట్టారు.

జి మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్ ప్రెవేట్ లిమిటెడ్ బ్యానర్ పెట్టి...శ్రీమంతుడు వంటి చిత్రాలకు సహ నిర్మాణం చేసారు.  అయితే పూర్తి భాధ్యతలను మైత్రీ మూవి మేకర్స్ పై పెట్టారు. కానీ ఇప్పుడు మహేష్ బాబు పూర్తి స్దాయి నిర్మాతగా మారి నిర్మాణం చేపట్టారు. వరస పెట్టి సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. 

అందులో భాగంగా ...మొదట చిత్రాన్ని అడవి శేషు హీరోగా నిర్మిస్తున్నట్లు సమాచారం. గూఢచారి చిత్రం డైరక్ట్ చేసిన శశికిరణ్ తిక్క ఈ సినిమాని దర్శకత్వం చేయబోతున్నారు.  మహేష్ భార్య నమ్రత శిరోద్కర్ ఈ యాక్షన్ థ్రిల్లర్ పూర్తి ప్రొడక్షన్ భాధ్యతలను వహించబోతున్నారు. త్వరలోనే అఫీషియల్ ఎనౌన్సమెంట్ రానుంది. 

ప్రస్తుతం మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న చిత్రం ‘మహర్షి’. పూజా హెగ్డే హీరోయిన్. అల్లరి నరేష్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకుడు. అశ్వనీదత్‌, దిల్‌రాజు, పీవీపీ నిర్మిస్తున్నారు. షూటింగ్ చివరి  దశకు చేరుకుంది. మార్చికి పూర్తవుతుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలయ్యాయి. గురువారం హైదరాబాద్‌లో డబ్బింగ్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది చిత్ర యూనిట్.

రామోజీ ఫిలింసిటీలో ‘మహర్షి’ కోసం ప్రత్యేకంగా ఓ సెట్‌ను తీర్చిదిద్దారు. పల్లెటూరి నేపథ్యంలో సాగే కీలక సన్నివేశాల్ని అక్కడే తెరకెక్కించారు.  సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌.