మహేష్-సుకుమార్ కాంబో.. రూ.150కోట్ల బడ్జెట్!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 6, Sep 2018, 1:55 PM IST
mahesh babu sukumar movie budget
Highlights

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా కనిపిస్తుండగా.. అల్లరి నరేష్ మరో ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. అయితే ఈ సినిమా తరువాత మహేష్.. సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమాను రూపొందించనున్నారు.

అయితే ఈ సినిమాని ఎంత బడ్జెట్ లో తీయనున్నారనే దానిపై ఓ ఆసక్తికర న్యూస్ హల్చల్ చేస్తోంది. దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించబోతున్నారని సమాచారం. కథ ప్రకారం సినిమాకు హాలీవుడ్ సాంకేతిక నిపుణులు పని చేయబోతున్నారు. అందుకే ఈ రేంజ్ లో ఖర్చు పెట్టబోతున్నారట. 'రంగస్థలం' సినిమాతో సుకుమార్ క్రేజ్ కూడా బాగా పెరిగింది. ఆయన తదుపరి సినిమా అంతకుమించి ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు.   

loader