తాజా వార్త ఏమిటంటే... మహేష్ బాబు దగ్గరకి కూడా వెబ్ సీరిస్ కు సంభందించి ఒక  ఇంట్రస్టింగ్  ప్రాజెక్ట్ వచ్చింది అనీ ఆ స్క్రిప్ట్ మహేష్ కి నచ్చింది అనీ గోఎ హెడ్ అన్నాడని తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ బాబు ఓ టాప్ డిజిటిల్ కంపెనీకు వెబ్ సీరిస్ లు అందించేందుకు సైన్ చేసారని తెలుస్తోంది. అలాగే కంటెంట్ ప్రధానంగా సాగే  చిన్న సినిమాలు నిర్మించి డిజిటిల్ ప్రపంచానికి అందిస్తామని ఎగ్రిమెంట్ లో ఉందిట.

దాంతో మహేష్ కు ,నమ్రతకు పరిచయం ఉన్న చాలా మమంది దర్శకులు కలిసి తమ ప్రపోజల్స్ పెడుతున్నారట. రకరకాల జోనర్స్ తో సబ్జెక్టు లు నమ్రతకు వినిపిస్తున్నారట. సినిమా అయితే ఏడాదికి ఒకటి మాత్రమే నిర్మిస్తారట. వెబ్ సీరిస్ లు మాత్రం కంటిన్యూగా చేస్తారని సమాచారం. 

అయితే సినిమాలో కానీ, వెబ్ సీరిస్ లో కానీ తాను నటించరట. కేవలం తన పేరు బ్యానర్ క్రింద వస్తుంది అని చెప్తున్నారు.  ఇక ఇప్పటికే హుస్సేన్ అని కొత్త దర్శకుడు వెబ్ సీరిస్ మహేష్ బాబు బ్యానర్ లో ప్రారంభించబోతున్నారు. జనవరిలో చివరిలో కానీ పిభ్రవరిలో కానీ ఈ వెబ్ సీరిస్ ప్రారంభం కానుంది.