#SSMB29:మహేష్,రాజమౌళి ఫిల్మ్ ఈ రెండు టైటిల్స్ లో ఏదో ఒకటి ఫైనల్?

. ఇది గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్‌గా ఉంటుంది. భారతీయ మూలాలతో.. ఇండియానా జోన్స్, జేమ్స్ బాండ్‍ను పోలిన మూవీగా ఉంటుంది

Mahesh Babu #SSMB29 Two titles shortlisted!?JSP

 'ఆర్ఆర్ఆర్' తో  గ్లోబల్ సక్సెస్ అందుకున్న  రాజమౌళి(Rajamouli), సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) కాంబోలో రాబోయే సినిమాపై అంచనాలు ఏ స్దాయిలో ఉన్నాయో తెలిసిందే.  ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్టుకు సంబందించిన చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది. ఈ సినిమాకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ జరుగుతోంది.లొకేషన్స్ హంటింగ్, స్టోరీ డిస్కషన్స్, కాస్టింగ్ విషయాల డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఈ చిత్రానికి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ రాస్తున్నారు. ఈ సినిమా జంగిల్ ఎడ్వెంచర్ గా తెరకెక్కుతోందని తెలిస్తున్న నేపధ్యంలో కథ గురించి రకరకాల విషయాలు వినపడుతున్నాయి. ఇలాంటి భారీ చిత్రానికి ఏం టైటిల్ పెట్టబోతున్నారనేది మరీ ఆసక్తికరమైన అంశం. తాజగా ఈ చిత్రం టైటిల్స్ అంటూ రెండు ప్రచారంలోకి వచ్చాయి. అవేమిటంటే

మహారాజా .. (Maharaja) ,చక్రవర్తి (Chakravarthy). ఈ రెండు టైటిల్స్ లో ఒకటి ఫైనల్ అయ్యే అవకాసం ఉందంటున్నారు. ప్రిన్స్ మహేష్ త్వరలో చక్రవర్తి కాబోతున్నారన్నమాట. మరో ప్రక్క ఈ చిత్రం కథ  అప్పట్లో అంటే 2006లో వచ్చిన లియోనార్డో చిత్రం #BloodDiamond ఆధారంగా రూపొందుతోందని సోషల్ మీడియాలో డిస్కషన్ మొదలైంది. అయితే సినిమా కథే అసలు పూర్తైందో లేదో తెలియకుండా ఇలా ఫలానా హాలీవుడ్ చిత్రం బేస్ చేసుకుని ఈ సినిమా చేస్తున్నారని ఎలా చెప్పగలరు, అవన్నీ ఆధారంలేని రూమర్స్  అని కొందరు అంటున్నారు.  

ఇక మహేశ్ బాబుతో తాను తీయబోయే చిత్రం (SSMB29) అడ్వెంచర్ యాక్షన్ జానర్‌లో ఉంటుందని ఆ మధ్యన ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. ఇండియానా జోన్స్ సిరీస్‍లా అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాగా ఆ మూవీ ఉంటుందని తెలిపాడు. మహేశ్‍తో తీయబోయే ఈ చిత్రం గ్లోబల్ సినిమాగా ఉంటుందని స్పష్టం చేశాడు. ఇండియానా జోన్స్, జేమ్స్ బాండ్ లాంటి ఎలాంటి హద్దులు లేని గ్లోబల్ సినిమాలను తెరకెక్కించాలనే తపన తనకు చాలా ఉందని రాజమౌళి తెలిపాడు.  

“ఇండియానా జోన్స్, జేమ్స్ బాండ్ లాంటి గ్లోబల్ సినిమాలు తీయాలని నేను ఎప్పుడూ అనుకుంటా. అడ్వెంచరస్ జానర్‌లో ప్రస్తుతం మా నాన్న ఓ సినిమా రాస్తున్నారు. స్క్రిప్ట్‌ను మేం ఇంకా ఫైనలైజ్ చేయలేదు. అయితే స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి” అని రాజమౌళి అన్నాడు. “నా తర్వాతి మూవీ మహేశ్ బాబుతో చేస్తున్నా. ఇది గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్‌గా ఉంటుంది. భారతీయ మూలాలతో.. ఇండియానా జోన్స్, జేమ్స్ బాండ్‍ను పోలిన మూవీగా ఉంటుంది” అని రాజమౌళి చెప్పాడు. రాజమౌళి - మహేశ్ బాబు మూవీ వర్కింగ్ టైటిల్ SSMB29గా ఉంది. ఈ చిత్రం 2025లో విడుదలయ్యే అవకాశం ఉంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios