మహేశ్ బాబు సినిమా సరికొత్త రికార్డు.. యూట్యూబ్ ను షేక్ చేస్తున్న ‘శ్రీమంతుడు’..
మహేశ్ బాబు - కొరటాల శివ కాంబోలో వచ్చిన బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘శ్రీమంతుడు’ మరో రికార్డు క్రియేట్ చేసింది. మిలియన్ల కొద్ది వ్యూస్ దక్కించుకుంటూ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) - దర్శకుడు కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం ’శ్రీమంతుడు’ (Srimanthudu). 2015లో రిలీజ్ అయిన చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. రిలీజ్ సమయంలో, ప్రమోషన్స్ లో ఈ మూవీ సెన్సేషన్ గా మారింది. ఇలా ఈ చిత్రం ఇప్పటికే పలు రికార్డులు సృష్టించింది. అప్పట్లోనే బాక్సాఫీస్ వద్ద రూ.150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇక ఈ సినిమా తాజాగా యూట్యూబ్ లోనూ ఓ మైలురాయిని సాధించింది.
‘శ్రీమంతుడు’ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్, సివి మోహన్‌లు నిర్మించారు. మహేష్ బాబు తన సొంత బ్యానర్ GMB ఎంటర్‌టైన్‌మెంట్స్ ద్వారా సినిమా నిర్మాణంలో కూడా భాగస్వామిగా ఉన్నారు. అయితే, ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ యూట్యూబ్ లో సెప్టెంబరు 13, 2017న అప్‌లోడ్ చేసారు. ఐదేళ్లలో ఈ చిత్రం భారీ వ్యూయర్ షిప్ దక్కించుకుంది. ఏకంగా 200ల మిలియన్ల వ్యూస్ ను సాధించి రికార్డు క్రియేట్ చేసింది. దానితో పాటు ప్రేక్షకుల నుండి 8.3 లక్షలకు పైగా లైక్‌లు కూడా అందుకుంది.
200 మిలియన్ల వ్యూయర్ షిప్ ను అందుకుని, యూట్యూబ్ ప్లాట్‌ఫారమ్‌పై ఈ మైలురాయిని చేరుకున్న మొదటి తెలుగు చిత్రంగా ‘శ్రీమంతుడు’ నిలిచింది. ఈ విజయంతో మహేశ్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. సోషల్ మీడియాలో చిత్రానికి సంబంధించిన పోస్టులను వైరల్ చేస్తున్నారు. ఈ చిత్రంలో శృతి హాసన్ (Shruti Haasan) కథానాయికగా నటించగా, జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్, సంపత్ నంది, రాహుల్ రవీంద్రన్, అలీ, వెన్నెల కిషోర్, సుకన్య కీలక పాత్రలు పోషించారు. దేవీశ్రీ ప్రసాద్ అందించిన సాంగ్స్ కూడా అప్పట్లో దుమ్ములేపాయి.