సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కాశ్మీర్ షెడ్యూల్ ని చిత్రబృందం బాగా ఎంజాయ్ చేసింది. విరామ సమయంలో అందరూ కలిసి సరదాగా క్రికెట్ ఆడారు.

మహేష్ బాబుతో పాటు ఆయన కుమారుడు గౌతమ్, దర్శకుడు వంశీ పైడిపల్లి కలిసి క్రికెట్ ఆడిన వీడియోను దర్శకుడు అనీల్ రావిపూడి తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేశాడు. మహేష్, గౌతమ్, వంశీ, మెహెర్ రమేష్ లతో సరదాగా గడిపినట్లు చెప్పారు. 

గౌతమ్ తనను అవుట్ చేసిన విషయాన్ని చెబుతూ ఏడుస్తున్న ఎమోజీలనుపోస్ట్ చేశాడు. ఈ వీడియో చూసిన అభిమానులు మహేష్ ని చూసుకుంటూ మురిసిపోతున్నారు. వీడియో షేర్ చేసినందుకు అనీల్ రావిపూడికి ధన్యవాదాలు చెబుతున్నారు. 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో మహేష్ సరసన హీరోయిన్ గా రష్మిక కనిపించనుంది.

విజయశాంతి, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, రాజేంద్రప్రసాద్ లు కీలకపాత్రల్లో కనిపించనున్నారు. దిల్ రాజు, అనిల్ సుంకర సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్  సంగీతం అందిస్తోన్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ హైదరాబాద్ లో అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్ లో జరుగుతోంది.