సూపర్ స్టార్ మహేష్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ తో ఫ్యాన్స్ కిక్ ఇచ్చారు. ఆయన తన జిమ్ వర్క్ ఔట్స్ సంబందించిన వీడియో పంచుకుని చక్కని సందేశం పంపారు. హెల్త్ అండ్ ఫిట్నెస్ ఎంత అవసరమో ఆ వీడియో ద్వారా మహేష్ తెలియజేశాడు. దాదాపు మీటర్ హైట్ ఉన్న టేబుల్ పైకి మహేష్ యంగ్ బాయ్ వలె జంప్ చేస్తున్నారు.  'మీ ఆటను మొదలుపెట్టండి. అపరిమితమైన లక్ష్యాలు నిర్దేశించుకోండి. తిరుగులేకుండా దూసుకుపోండి'... అంటూ తన వీడియోకి కామెంట్ పెట్టారు మహేష్. 
మహేష్ బాబు వర్క్ అవుట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

కొద్దిరోజులలో సర్కారు వారి పాట షూటింగ్ మొదలుకానుంది. ఈనేపథ్యంలో మహేష్ అన్ని విధాలా సిద్ధం అవుతున్నట్లు కనిపిస్తుంది. 45ఏళ్ల మహేష్ ఫిట్ నెస్ తో పాటు సూపర్ గ్లామర్ మైంటైన్ చేస్తున్నారు. దానికి కారణం హెల్తీ వర్క్స్ తో పాటు ఫుడ్ హ్యాబిట్స్ అనాలి. 
ఇక సర్కారు వారి పాట మూవీ కోసం మహేష్ కొత్త గెటప్ ట్రై చేయనున్నారు. దీని కోసం ఆయన జుట్టు పెంచారు. బ్యాంకింగ్ వ్యవస్థపై తెరకెక్కుతున్న సెటైరికల్ మూవీగా సర్కారు వారి పాట ఉంటుందని సమాచారం. 

మహేష్ రోల్ కూడా పూర్తిగా భిన్నంగా దర్శకుడు డిజైన్ చేశారట. గీతగోవిందం ఫేమ్ పరుశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట తెరకెక్కుతుంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం థమన్ అందిస్తున్నారు.