ఇటీవల మహేష్ వరుసగా వర్కౌట్ ఫోటోలు, వీడియోలు పంచుకుంటూ ఫ్యాన్స్ ని సర్‌ప్రైజ్ చేస్తున్నారు. తాజాగా మరో వీడియోని ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నారు.
మహేష్‌బాబు అందానికి మారుపేరు. ఆయన అమ్మాయిల రాకుమారుడు. ఆయన అందానికి లక్షల మంది అమ్మాయిలు అభిమానులున్నారు. ఎంతో మందికి క్రష్ కూడా. కెరీర్ బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు అదే లుక్‌ని మెయింటేన్ చేస్తున్నారు. టాలీవుడ్‌లో మోస్ట్ హ్యాండ్సమ్ హీరోల్లో ముందుండే మహేష్.. జిమ్‌లో ఎంతగా శ్రమిస్తారో తెలుసా? ఆయన జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్న వీడియోలు, ఫోటోలు పంచుకోవడం చాలా అరుదు. సాధారణంగా హీరోలు ఏదైనా సినిమా కోసమైతేనే, ప్రమోషన్స్ కోసం వాటిని షేర్ చేస్తుంటారు. మామూలుగా అయితే చాలా అరుదు. కానీ ఇటీవల మహేష్ వరుసగా వర్కౌట్ ఫోటోలు, వీడియోలు పంచుకుంటూ ఫ్యాన్స్ ని సర్‌ప్రైజ్ చేస్తున్నారు.
తాజాగా మరో వీడియోని ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నారు. ఇందులో మహేష్‌బాబు చాలా కఠినమైన వర్కౌట్స్ చేస్తుండటమే కాదు, చాలా కఠినంగా చేస్తుండటం విశేషం. `నా శనివారం సిజిల్ సెట్ నాకిష్టమైన స్కిల్‌మిల్ ఫినిషర్‌తో..` అంటూ అంటూ మహేష్ ఈ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌ల పంచుకున్నారు. ఇందులో మహేష్.. ఏమేం వర్కౌట్స్ చేశారో తెలిపారు. ఒక నిమిషం పాటు ల్యాండ్ మైన్ ప్రెస్, నిమిషం కెటిల్ బెల్ స్వింగ్, మరో నిమిషం స్కిల్‌మిల్ రన్ చేసినట్టు తెలిపారు. వీడియోలోనూ ఈ మూడు చేస్తూ కనిపించారు మహేష్.
అయితే ఇక్కడే ఓ సర్‌ప్రైజ్ ఇచ్చారు మహేష్. ఛాలెంజ్ విసిరారు. తాను ఇవి చేయగలిగాను అని, మిరు ఎన్ని సెట్లు చేయగలరు? అంటూ ప్రశ్నించారు. ఇందులో ఫిజియోథెరపిస్ట్ లు డాక్టర్ మనీష్ గాబ్రియెల్(మయో మూవీమెంట్ ఇండియా ఫౌండర్), స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్ హీత్ మాథ్యూస్‌లకు మహేష్ ఛాలెంజ్ విసిరారు. వీరికే కాదు, తన అభిమానులకు కూడా ఆయన ఈ వర్కౌట్స్ ఛాలెంజ్‌ని విసరడం విశేషం. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక రేపటి నుంచి మహేష్ పేర్కొన్నవారితోపాటు ఫ్యాన్స్ కూడా తమ వర్కౌట్స్ వీడియోలను పంచుకునే అవకాశం ఉంది.
మహేష్ ఇటీవల ఫిజియోథెరపిస్ట్ మాథ్యూని కలిశారు. ఆయన సారథ్యంలోనే వర్కౌట్స్ చేశారు. ఈ సందర్భంగా ఆయనతో దిగిన ఫోటోని పంచుకుంటూ వర్కౌట్స్ కి సంబంధించిన మీ అప్రోచ్ తనని ఎంతో ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. అలాగే ఫిట్‌నెస్ ఛాలెంజ్‌కి మరో మేగజీన్ పంచుకుంటూ బెస్ట్ ఫిట్‌నెస్ ఛాలెంజ్ అని పేర్కొన్నారు. మొత్తంగా ఇలా ఫిట్‌నెస్ ఛాలెంజ్‌లు, వర్కౌట్స్ తో ఆశ్చర్యపరుస్తున్నారు మహేష్. ఫ్యాన్స్ కి మరింతగా దగ్గరవుతున్నారు. వారిని ఖుషీ చేస్తూ, ఇన్‌స్పైర్ చేస్తున్నారు.
ప్రస్తుతం మహేష్‌బాబు.. త్రివిక్రమ్ దర్శకత్వంలో `గుంటూరు కారం` చిత్రంలో నటిస్తున్నారు. శ్రీలీల కథానాయిక. పూజా హెగ్డే స్థానంలో మరో హీరోయిన్‌ని తీసుకుంటున్నారట. మీనాక్షిచౌదరి పేరు వినిపిస్తుంది. హారికా అండ్ హాసిని పతాకంపై ఎస్. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోంది. చాలా గ్యాప్ తర్వాత ఇటీవలే ఈ సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ సినిమా కోసం కూడా మహేష్ జిమ్‌లో కష్టపడుతున్నారు. ఫిట్‌నెస్ కోసం బాగా శ్రమిస్తున్నారు. `వన్ నేనొక్కడినే` తర్వాత ఆ స్థాయిలో ఈ సినిమా కోసం కష్టపడుతున్నట్టు తెలుస్తుంది.
