రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా కోసం సినీ ప్రేమికులు ఎప్పటినుండో వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి రాజమౌళి కూడా అనేక సిని వేదికలపై స్పందించడం జరిగింది. ఇప్పుడు అది నిజం కాబోతోంది. ఈ నేపధ్యంలో మహేష్ బాబు ఈ కాంబినేషన్ గురించి మాట్లాడారు.

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తో ఈ సారి ఖచ్చితంగా టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సినిమా చేయనున్నారు. ఎప్పటినుంచో వీరిద్దరూ కలిసి మూవీ చేయాలని అనుకుంటున్నారు. కానీ కుదరడం లేదు. మహేష్ అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు. ఫ్యాన్స్‌ కోరిక త్వరలో తీరనుంది. మహేశ్ బాబు ఆగస్టు 9న అంటే ఈ రోజున పుట్టిన రోజు జరుపుకొంటున్నాడు. ఈ సందర్భంగా యస్‌యస్. రాజమౌళి (SS Rajamouli)తో చేయబోయే ప్రాజెక్టు గురించి మాట్లాడాడు.

రాజమౌళితో పనిచేయాలనే కల నెరవేరబోతున్నందకు సంతోషంగా ఉన్నానని మహేశ్ బాబు తెలిపాడు. "అతనితో కలిసి పని చేయడం అంటే నా కల నిజం కావడంలాంటిదే. రాజమౌళితో సినిమా చేయడం అంటే ఒకేసారి 25 మూవీస్‌ చేయడంలాంటిదే. అది శారీరకంగా కాస్త ఎక్కుడ డిమాండ్‌ చేసే మూవీయే. దీనిపై నేను చాలా ఎక్సైటింగ్‌గా ఉన్నాను. ఇది పాన్‌ ఇండియా మూవీ. అన్ని అడ్డంకులను అధిగమించి దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులకు మా సినిమా అందిస్తాం" అని మహేశ్ బాబు పేర్కొన్నాడు. 

రాజమౌళి, మహేశ్ బాబు సినిమా యాక్షన్ అడ్వెంచర్‌గా తెరకెక్కనున్నట్టు తెలుస్తోంది. ఆఫ్రికా అడవి నేపథ్యంలో కథ కొనసాగనుందని రూమర్లు షికార్లు కొడుతున్నాయి. మహేశ్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ‘పోకిరి’ స్పెషల్ షోస్‌ను ప్రపంచవ్యాప్తంగా ఏర్పాటు చేశారు. దాదాపుగా 200షో స్క్రీనింగ్స్‌ను వేయనున్నారు. ఈ షోల ద్వారా వచ్చిన ఆదాయం మహేశ్ బాబు‌ పౌండేషన్‌కు విరాళంగా అందజేస్తున్నారు. ‘పోకిరి’ కీ పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించాడు. ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఘట్టమనేని మంజుల, పూరీ జగన్నాథ్ కలసి నిర్మించారు.