మహేష్ బాబు సినిమా అంటే స్టార్ట్ అవ్వకముందే బిజినెస్ ఎంక్వైరీలు మొదలైపోతాయి. ఎందుకంటే ఆయన సినిమాలపై ఆ స్దాయి ఎక్సపెక్టేషన్స్ ఉంటాయి.  ఆయన తాజా చిత్రం  “సర్కారు వారి పాట”ది అదే పరిస్దితి. ఈ సినిమాకు ఒక్కో ఏరియాకు బిజినెస్ లాక్ చేసుకునేందుకు బేరసారాలు సాగుతున్నట్లు సమాచారం. అందులో భాగంగా  ఉత్తరాంధ్ర బిజినెస్  కంప్లీట్ చేసినట్టు సమాచారం. అది కూడా అలా ఇలా కాదు. ఓ స్దాయి రేట్లకే  థియేట్రికల్ రైట్స్ అమ్మేసారని తెలుస్తుంది. ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న టాక్ ప్రకారం ఈ చిత్రం హక్కులు 15 కోట్లకు అమ్ముడు పోయాయట. దాంతో నిర్మాతలు పండుగ చేసుకుంటున్నారట. మిగతా ఏరియాలు ఏ రేటుకు అమ్మచ్చో, మొత్తం ఎంత బిజినెస్ అవుతుందనే సాలిడ్ లెక్కలతో ఫుల్ ఖుషీ మూడ్ లో ఉన్నారట.  మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు సంయుక్తంగా నిర్మాణం చేస్తున్నారు.

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తీ సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “సర్కారు వారి పాట”. దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై నెవర్ బిఫోర్ అంచనాలు నెలకొన్నాయి. మహేష్ చేసిన గత మూడు చిత్రాలు ఒకదాన్ని మించి ఒకటి భారీ హిట్ కావడంతో ఇక నెక్స్ట్ హ్యాట్రిక్ దీనితోనే మొదలవ్వాలని సాలిడ్ గా ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. మరి అందుకు తగ్గట్టుగానే ఆల్రెడీ ఈ సినిమా బిజినెస్ లెక్కలు స్టార్ట్ అయ్యాయని టాక్ వినిపిస్తుంది.

ఇక ఈ స్దాయి బిజినెస్ కు కారణం ... వరుసగా ''భరత్ అనే నేను, మహర్షి'' సినిమాలతో సత్తా చాటిన సూపర్ స్టార్ మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' అనిపించుకుంటూ హ్యాట్రిక్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇదే బాటలో 'సర్కారు వారి పాట' అంటూ మరో వైవిద్యభరితమైన కథను ఓకే చేసిన మహేష్.. ఇంకా ఈ సినిమా షూటింగ్ మొదలుకాకముందే రికార్డుల సునామీ సృష్టిస్తున్నారు. సోషల్ మీడియా ఖాతాల్లో 'సర్కారు వారి పాట' మోత మోగిస్తూ నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతున్నారు.

 ఈ చిత్రంలో  మహేష్ బాబు హీరోగా నటించడమే గాక చిత్ర నిర్మాణంలోనూ భాగస్వామ్యం పంచుకున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నాయి. మహేష్ కెరీర్‌లో 27వ సినిమాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.