`సర్కారు వారి పాట` చిత్రం నుంచి అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చింది యూనిట్‌. సినిమా చివరి సాంగ్‌ షూటింగ్‌ జరుగుతున్నట్టు సోమవారం ప్రకటించింది. తాజాగా  మరో అప్‌డేట్‌ ఇచ్చింది.

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు(Maheshbabu) నటిస్తున్న లేటెస్ట్ మూవీ `సర్కారు వారి పాట`(Sarkaru Vaari Paata). ఈ సినిమా అప్‌డేట్ల విషయంలో అభిమానులు ఒకింత అసంతృప్తితో ఉన్నారు. ఎప్పుడూ సినిమాకి సంబంధించిన అప్‌డేట్లు లేట్‌ అవుతూనే ఉన్నాయి. వాయిదాలు పడుతూనే ఉన్నాయి. దీంతో మహేష్‌ ఫ్యాన్స్ నిర్మాణ సంస్థపై, దర్శకుడిపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎట్టకేలకు ఈ చిత్రం నుంచి అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చింది యూనిట్‌. సినిమా చివరి సాంగ్‌ షూటింగ్‌ జరుగుతున్నట్టు సోమవారం ప్రకటించింది. 

తాజాగా ఈ పాటకి సంబంధించి మరో అప్‌డేట్‌ ఇచ్చింది. సెట్‌లో మహేష్‌బాబు ప్రీ లుక్‌ని పంచుకుంది. ఈ ప్రీ లుక్‌లో మహేష్‌ కాలుకి కర్చీఫ్‌ కట్టుకుని ఉంది. రెడ్‌ కర్చీఫ్‌తో స్టెప్పులేస్తూ అదిరిపోయేలా ఉంది. ఈ సందర్భంగా పాట గురించిన హింట్‌ ఇచ్చారు. ఇది మాస్‌ సాంగ్‌ అని తెలిపింది. సాంగ్‌ని షూట్‌ చేస్తుండగా, మానిటర్‌లో చూస్తున్న పిక్స్ ని సైతం పంచుకున్నారు. ఈ పాటకి శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. దర్శకుడు పరశురామ్‌తోకలిసి ఈ సాంగ్‌ చిత్రీకరణ సందర్భంగా దిగిన ఫోటోలను రిలీజ్‌ చేసింది యూనిట్‌. 

అయితే మానిటర్‌లో షేడ్‌లో కనిపించిన దాని ప్రకారం మహేష్‌ తోపాటు కొంత మంది డాన్సర్లున్నారు. మరోవైపు ఈ పాటని మాస్‌ సాంగ్‌లోనే నెక్ట్స్ లెవల్‌ అని, థియేటర్లో బాలిస్టిక్‌లా పేలుతుందని పేర్కొంది యూనిట్‌. సినిమాలోనేది ఇది బెస్ట్ మాస్ సాంగ్‌గా ఉండబోతుందని తెలుస్తుంది. ఇక బ్యాంక్‌ కుంభకోణాల నేపథ్యంలో సాగే `సర్కారు వారి పాట` చిత్రంలో మహేష్‌కి జోడీగా కీర్తిసురేష్‌ నటిస్తుంది. `గీత గోవిందం` తర్వాత పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఈ సినిమాలో మహేష్‌ కొత్త లుక్‌లో కనిపించబోతున్నారు.

ఈ సినిమా మే 12న విడుదల కాబోతుంది. దీంతో ప్రమోషన్‌ కార్యక్రమాల జోరు పెంచింది యూనిట్‌. ఇప్పటికే `కళావతి`, `పెన్నీ` సాంగ్‌లు విడుదలై విశేషంగా ఆకట్టుకున్నాయి. రెండూ మిలియన్స్ వ్యూస్‌తో ట్రెండింగ్‌ అయ్యాయి. ముఖ్యంగా పెన్నీ సాంగ్‌లో మహేష్‌ డాటర్‌ సితార స్టెప్పులేయడం విశేషం. ఈ పాటలు సినిమాపై అంచనాలని పెంచాయి. ఎస్‌ఎస్‌. థమన్‌ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం షూట్‌ చేస్తున్న సాంగ్‌ చివరిదని, దీంతో షూటింగ్‌ మొత్తం పూర్తవుతుందని యూనిట్‌ పేర్కొంది.