మహేష్ బాబు సర్కారు వారి పాట కలెక్షన్స్ దుమ్మురేపుతోంది. వీకెండ్ లో సాలిడ్ వసూళ్లు సాధించిన ఈ మూవీ వర్కింగ్ డేస్ లో కూడా చెప్పుకోదగ్గ చెప్పుకోదగ్గ వసూళ్లతో రాణించింది.  

సోషల్ మెసేజ్ తో కూడిన యాక్షన్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) . మే 12న వరల్డ్ వైడ్ గా రికార్డు థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రం భారీ వసూళ్లు రాబడుతుంది. ఫస్ట్ వీక్ ముగిసే నాటికి సర్కారు వారి పాట రూ. 171 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టింది. ఈ మేరకు మేకర్స్ అధికారిక పోస్టర్ విడుదల చేశారు. ఏపీ/తెలంగాణా రాష్ట్రాల్లో 7 రోజులకు గాను రూ. 121 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు అందుకుంది. నైజాం లో సర్కారు వారి పాట షేరు రూ. 33 కోట్లకు పైగా ఉన్నట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. 

ఇక ఓవర్ సీస్ లో సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata Collections) సాలిడ్ కలెక్షన్స్ రాబట్టింది. తెలుగు చిత్రాలకు అతిపెద్ద మార్కెట్ గా ఉన్న నార్త్ అమెరికాలో $2.12 మిలియన్ మార్క్ దాటేసింది. అలాగే ఆస్ట్రేలియాలో సర్కారు వారి పాట మంచి వసూళ్లు అందుకుంటుంది. సర్కారు వారి పాట ఓవర్సీస్ హక్కులు రూ. 11 కోట్లకు అమ్మారు. ఈ క్రమంలో సర్కారు వారి పాట అక్కడ సేఫ్ జోన్ లోకి చేరినట్లే. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ 85-90 % రికవరీ చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో ఈ వీకెండ్ కీలకం కానుంది. చెప్పుకోదగ్గ పెద్ద చిత్రాలు విడుదల లేని పక్షంలో సర్కారు వారి పాటకు కలిసి రానుంది. 

Scroll to load tweet…

ఈ వీకెండ్ సర్కారు వారి పాట రాణిస్తే దాదాపు సేఫ్ అయినట్లే. నైజాంలో కంటే ఏపీలో సర్కారు వారి పాట వసూళ్లు స్ట్రాంగ్ గా ఉన్నాయి. సమ్మర్ హాలిడేస్ కారణంగా వర్కింగ్ డేస్ లో కూడా వసూళ్లు దక్కుతున్నాయి. మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, 14 ప్లస్ రీల్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించాయి. మహేష్ బాబు(Mahesh babu)కి జంటగా కీర్తి సురేష్ నటించారు. థమన్ సంగీతం అందించారు. సముద్ర ఖని, అజయ్, నదియా, సుబ్బరాజ్, వెన్నెల కిషోర్ కీలక రోల్స్ చేశారు.