SVP Collections: రెండు రోజుల్లో సెంచరీ కొట్టిన మహేష్..!
సర్కారు వారి పాట రెండు రోజుల్లో వంద కోట్ల మార్కు చేరుకుంది. మహేష్ బాక్సాఫీస్ వద్ద జోరు చూపిస్తుండగా... మూవీ సాలిడ్ కలెక్షన్స్ సాధిస్తుంది. లాంగ్ వీకెండ్ నేపథ్యంలో సర్కారు వారి పాట చెప్పుకోదగ్గ వసూళ్లు రాబట్టడం ఖాయంగా కనిపిస్తుంది.

మహేష్ లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట (SVP Collections) వంద కోట్ల మార్కు చేరుకుంది. రెండు రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ. 103 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టినట్లు పోస్టర్స్ విడుదల చేశారు. మొదటి రోజు రూ. 75 కోట్ల గ్రాస్ రాబట్టిన సర్కారు వారి పాట రెండో రోజు వంద కోట్ల మార్క్ దాటేసింది. ఏపీ/తెలంగాణా రాష్ట్రాల్లో కలిపి సర్కారు వారి పాట రెండు రోజులకు రూ. 48.5 కోట్ల షేర్ అందుకుంది. సెలవు దినాల నేపథ్యంలో శని, ఆదివారం ఈ చిత్ర కలెక్షన్స్ మరింత మెరుగు కావచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇక యూఎస్ మహేష్ (Mahesh Babu)కి బాగా పట్టున్న మార్కెట్.అక్కడ ప్రీమియర్స్ తోనే వన్ మిలియన్ మార్క్ చేరుకున్న సర్కారు వారి పాట $1.5 మిలియన్ క్రాస్ చేసింది. యూఎస్ తో పాటు ఏపీలో సర్కారు వారి పాట కలెక్షన్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. హైదరాబాద్ సిటీలో కూడా సర్కారు వారి పాట మంచి వసూళ్లు రాబడుతుంది.
మిక్స్డ్ టాక్ అందుకున్న సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata)ఈ రేంజ్ వసూళ్లు సాధించడం చెప్పుకోదగ్గ విషయం. అయితే ఫస్ట్ హాఫ్ లో కీర్తి సురేష్-మహేష్ రొమాన్స్, కెమిస్ట్రీతో పాటు వెన్నెల కిషోర్ తో కామెడీ ట్రాక్ క్లాస్, లేడీ ఆడియన్స్ కి బాగా నచ్చేస్తుంది. సెకండ్ హాఫ్ మూవీని బాగా దెబ్బతీసినట్లు తెలుస్తుంది. అయితే మహేష్ మాస్ మేనరిజం, డైలాగ్స్, సోషల్ మెసేజ్ ఆడియన్స్ కి కనెక్ట్ అయితే ఈ చిత్ర ఫలితం వేరేలా ఉంటుంది.
సమ్మర్ సీజన్ కూడా సర్కార్ వారి పాటకు కలిసి రావచ్చు. మరోవైపు సమీపంలో పెద్ద చిత్రాల విడుదల లేదు. మే 27న విడుదల కానున్న ఎఫ్ 3 మాత్రమే సర్కారు వారి పాటకు పోటీ ఇవ్వగలిన మూవీ. ఇక లాంగ్ రన్ లో మహేష్ సర్కారు వారి పాటతో ఎంత వరకు రికవరీ చేస్తాడో చూడాలి. దర్శకుడు పరుశురామ్ తెరకెక్కించిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు. సముద్ర ఖని, నదియా, వెన్నెలకు కిషోర్ కీలక రోల్స్ చేయడం జరిగింది.