సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న డిఫరెంట్ కామెడీ ఎంటర్టైనర్ సినిమా పనులు శరవేగంగా సాగుతున్నాయి. మొదటి షెడ్యూల్ మొదలెట్టడానికి కాస్త తడబడ్డారు. ఆ తరువాత సెకండ్ షెడ్యూల్ లో అనుకోని కారణాలతో మహేష్ వేరే పనుల్లో బిజీ కావాల్సి వచ్చింది. మహేష్ డేట్స్ ఒక్కసారి మారిపోయాయి అంటే వాటిని ఫాస్ట్ ఫీల్ చేయడానికి ట్రై చేస్తాడు. 

మొత్తానికి ఏ విధంగా సినిమా మీద ఎఫెక్ట్ పడకూడదని మహేష్ చాలా కేర్ తీసుకుంటాడు. సరిలేరు నీకెవ్వరు సినిమా కోసం మహేష్ స్పీడ్ పెంచినట్లు తెలుస్తోంది. సంక్రాంతికి సినిమా రిలీజ్ కావాలి కాబట్టి వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేయాలనీ అనుకుంటున్నారు. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. 

కర్నూల్  కొండారెడ్డి బురుజు సెట్ లో మహేష్ - విజయశాంతికి సంబందించిన సీన్స్ ని చిత్రీకరిస్తున్నారు. మొదట ఈ సీన్స్ ను రియల్ లొకేషన్స్ లో షూట్ చేయాలనీ అనుకున్నారు. ఒక్కడు సినిమాలో మహేష్  ప్రకాష్ రాజ్ భూమిక ల మధ్య వచ్చే ఫస్ట్ సీన్ ని కొండారెడ్డి బురుజు  దగ్గర షూట్ చేసినట్లుగా రియాలిటీగా తెరకెక్కించాలని అనుకున్నారు. 

కానీ ఇప్పుడు జనాల్ని కంట్రోల్ చేసి 12 రోజులకు పైగా షూటింగ్ చేయడం అంటే సాధారణమైన విషయం కాదు. అందుకే చిత్ర యూనిట్ ఏడెకరాల స్థలంలో సెట్ వేసి షూటింగ్ చేస్తున్నారు.