టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు  టాప్ డిజిటిల్ కంపెనీలకు కంటెంట్  అందించేందుకు సిద్దమవుతున్నారనే సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆయన మొదటగా వెబ్ సీరిస్ ని స్టార్ట్ చేస్తున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం తొలి వెబ్ సీరిస్ డిటిక్టెవ్ కథ నేపధ్యంలో సాగుతుంది. మాకు మేమే మీకు మీరే, నాన్నకు ప్రేమతో చిత్రాలతో పరిచయమైన హుస్సేన్ షా కిరణ్ డైరక్ట్ చేయనున్నారు. ఈ మేరకు బాలీవుడ్ మ్యాగజైన్ డిఎన్ ఎ ఓ కథనం ప్రచురించింది. 

ఇక ఈ సీరిస్ కు టైటిల్ గా ఛార్లి అని పెట్టబోతున్నారని, తమ టీమ్ తో కలిసి వివిధ సమస్యలు సాల్వ్ చేస్తూంటాడని వినికిడి. ఇప్పటికే టీమ్ మొత్తం వరల్డ్ వైజ్ గా ఉన్న పాపులర్ క్రైమ్ థ్రిల్లర్స్ ని డీప్ గా రీసెర్చ్ చేసారని, నక్సల్స్, టెర్రరిస్ట్ లు కూడా ఈ కథలో భాగంగా ఉంటారని సమాచారం. 

జియోతో కలిసి మహేష్ బాబు తన ఎమ్ బి ప్రొడక్షన్స్  పై నిర్మించనున్నారు. నెట్ ఫ్లిక్స్ లో ఈ వెబ్ సీరిస్ ప్రసారం కానుంది. మహేష్ బార్య నమ్రత ఈ సీరిస్ ని దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్నారు.  

ఇక మహేష్‌ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘మహర్షి’. పొల్లాచ్చిలో తాజాగా షూటింగ్‌ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఇక ఫిబ్రవరి మొదటి వారంలో హైదరాబాద్‌లో మరో షెడ్యూల్‌ను ప్లాన్‌ చేశారట చిత్ర యూనిట్. ఆ తర్వాత కొన్ని కీలక సన్నివేశాల కోసం అబుదాబీకి ‘మహర్షి’టీమ్‌ వెళ్లనుంది. అంతటితో ఈ సినిమా షూటింగ్‌ పూర్తవుతుందని సమాచారం.

ఇక ఈ సినిమాలో మహేష్ తొలిసారిగా గడ్డంతో నటిస్తున్నాడు. ఇప్పటికే మహేష్ న్యూలుక్‌కు సూపర్బ్‌ రెస్పాన్స్‌ వచ్చింది.  ఈ సినిమాను ఏప్రిల్ 25న రిలీజ్ చేయనున్నట్టు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో యంగ్ హీరో అల్లరి నరేష్‌ కీలక పాత్రలో కనిపించనున్నాడు