రంగ‌స్థ‌లం చిత్రంతో భారీ హిట్ కొట్టిన సుకుమార్‌, భ‌ర‌త్ అనే నేను వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ఇచ్చిన మ‌హేష్ బాబు కాంబినేష‌న్‌లో ఓ మూవీ తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ వార్త‌లు అతి త్వరలో  నిజం కాబోతున్నాయి కానీ కానీ మహేష్ పెట్టుకున్న కొన్ని రూల్స్ వల్ల లేటైపోతోందని సమాచారం. రీసెంట్ గా  మ‌హేష్ బాబుకి బ్రీఫ్‌గా లైన్ వినిపించాడ‌ట సుకుమార్‌. ఆ లైన్ మ‌హేష్‌కి ఎంతో న‌చ్చ‌డంతో వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ట‌. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కేస్తుందని అంతా భావించారు. అయితే మహేష్ తనకు పూర్తి వెర్షన్ క్లైమాక్స్ తో సహా వినిపించాలని చెప్పారట. 

అప్పటికి సినిమాలో కొన్ని సీక్వెన్స్ లు ఎలా తీయబోతున్నామో , వాటి ఇంపాక్ట్ చెప్పి, క్లైమాక్స్ త్వరలో పూర్తవుతుంది...అద్బుతంగా వస్తుందని హామీ ఇచ్చారట సుకుమార్. అయినా మహేష్ ...అదేదో విన్న తర్వాతే ఎనౌన్స్ చేద్దామని అన్నారట. అందుకు కారణం ఆయన రీసెంట్ గా బ్రహ్మాత్సవం, స్పెడర్ సినిమాలతో తిన్న దెబ్బలే అంటున్నారు.

బ్రహ్మోత్సవం చిత్రం సెకండాఫ్ వినకుండా ఓకె చేసిన మహేష్, స్పైడర్ సినిమాని క్లైమాక్స్ వినకుండా పట్టాలు ఎక్కించేసాడట. ఆ రెండు  ప్రాజెక్టులు కేవలం ఆ దర్శకుల మీద నమ్మకంతోనే స్క్రిప్టు వదిలేసి ఫైనలైజ్ చేసారు. అయితే సుకుమార్ తో గతంలో వన్ , నేనొక్కడినే చిత్రం చేయటం..అది కమర్షియల్ గా డిజాస్టర్ కావటంతో  ఈసారి అలాంటిది జరగకూడదని గట్టి నిర్ణయం తీసుకున్నాడని చెప్తున్నారు. 

మహేష్ తీసుకున్న నిర్ణయం మంచిదే కానీ...సుకుమార్ వంటి రైటింగ్ స్క్రిల్స్ ఉన్న దర్శకులకు అది ఇబ్బందే. ఎందుకంటే వాళ్లు నిరంతరం కొత్త కొత్త ఆలోచనలతో స్క్రిప్టుని మార్చేస్తూంటారు. అలాంటప్పుడు బౌండింగ్ స్క్రిప్టు అనేది కొద్దిగా టైమ్ ఎక్కువ తీసుకుంటుంది. 

మైత్రి మూవీ మేక‌ర్స్ బేన‌ర్‌లో ఈ చిత్రం రూపొంద‌నుంది. ఈ ప్రాజెక్ట్ కోసం సుకుమార్ ఏకంగా 15 కోట్ల రెమ్యున‌రేష‌న్ అందుకోబోతున్న‌ట్టు స‌మాచారం. తాజాగా ప్రీ ప్రొడ‌క్షన్ ప‌నులు మొద‌లు పెట్టిన‌ సుక్కూ 2019 ద్వితీయార్దంలో మూవీ విడుద‌ల చేయ‌నున్నాడట‌. సంగీత ద‌ర్శ‌కుడిగా మ‌రోసారి త‌న సినిమాకి దేవి శ్రీ ప్రసాద్‌ని ఎంపిక చేశాడ‌ని తెలుస్తుంది. ఈ చిత్రంలో న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌ని కూడా ఎంపిక చేసే ప‌నిలో ఉన్నాడు సుకుమార్‌.