ముంబైలో సీక్రెట్ గా మహేష్ ఎవరిని కలిసినట్లు?

mahesh babu's secret meeting in mumbai
Highlights

మహేష్ ముంబై సీక్రెట్ మీటింగ్ ఎవరితో అంటే?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన తదుపరి సినిమా కోసం సిద్ధమవుతున్నారు. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాలో మహేష్ కాలేజ్ స్టూడెంట్ పాత్రలో కొంత సమయం కనిపించబోతున్నాడు. దీనికోసమే గడ్డం, మీసాలు పెంచుతున్నాడు ప్రిన్స్.

అయితే ఓ వారం క్రితం మహేష్ తన ఫ్యామిలీతో కలిసి పారిస్, స్పెయిన్ తిరిగొచ్చాడు. అయితే హైదరాబాద్ కు వచ్చే ఓ రోజు ముందు ఆయన ముంబైలో గడిపినట్లు సమాచారం. చాలా కాలంగా మహేష్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటివరకు ఆయన ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే మహేష్ తన బాలీవుడ్ డెబ్యూ కోసమే ముంబైకు వెళ్లి కొందరు స్టార్ డైరెక్టర్లను, నిర్మాతలను కలిసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ విషయాన్ని ఓ ప్రముఖ బాలీవుడ్ పేపర్ ప్రచురించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.ప్రస్తుతానికి మహేష్ చాలా బిజీ అనే చెప్పాలి. వంశీ సినిమా పూర్తి చేసిన తరువాత సుకుమార్ లైన్ లో ఉన్నాడు. 14 రీల్స్ బ్యానర్ లో కూడా ఓ సినిమా చేయాల్సివుంది. కాబట్టి ఇప్పట్లో అయితే ఆయన బాలీవుడ్ సినిమా చేసే ఛాన్స్ లేదనిపిస్తుంది. కానీ మంచి కథ, డైరెక్టర్ దొరికితే మాత్రం ఆయన కచ్చితంగా బాలీవుడ్ కు వెళ్తాడని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి!

loader