‘భరత్‌ అనే నేను’ వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ తరువాత మహేష్‌ బాబు నటిస్తున్న మహర్షి చిత్రంపై భారీ అంచనాలు ఉండటంలో వింతేమీలేదు. దానికి తోడు మహేష్‌ ఎన్నడూ లేని బియర్డ్‌ లుక్‌లో మహర్షి చిత్రంలో కనిపించేసరికి సూపర్‌స్టార్‌ ఫ్యాన్స్ పుల్ ఖుషీ అయ్యిపోయారు. దానికి తోడు స్టైలిష్ గా ఉండే  ఓ పోస్టర్‌ను 2019 జనవరి 1న రిలీజ్‌ చేసి ఆడియన్స్‌కు న్యూ ఇయర్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు.   ఈ నేపధ్యంలో ఈ చిత్రం కథ ఎలా ఉండబోతోంది..కథలో కీ పాయింట్ ఏమిటనే విషయమై అభిమానుల్లో చర్చ మొదలైంది. దాంతో  ఆ కీపాయింట్ ఇదే నంటూ ఓ కథనం ప్రచారంలోకి వచ్చింది. అదేమిటంటే..

మనదేశం మొదట నుంచీ  వ్యవసాయ ఆధఆర దేశం.  అయితే పరిస్దితులు బాగోక, ప్రభుత్వాలు సహకరించక, వ్యవసాయం దండగ అనే అభిప్రాయానికి వచ్చేస్తున్నారు  రైతులు . పంట పొలాలను అమ్మేసుకోని సిటీలకు వలస వెళ్ళిపోతున్నారు. మరికొంతమంది  అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు . దీనికంతటికి కారణం రైతుకి సరైన గిట్టుబాటు ధర రాకపోవడం..వ్యవసాయానికి ఎక్కువ ఖర్చు కావటం..అది వెనక్కి తిరిగి రాకపోవటం.  అయితే ఈ విషయాన్నే ఈ సినిమాలో చర్చంచనున్నారని తెలుస్తోంది.

ఆధునిక పద్దతులతో చేస్తే వ్యవసాయం దండగ కాదు  వ్యవసాయం పండగ అనే కాన్సెప్ట్ తో తెరకెక్కుతోందని తెలుస్తోంది. కథ మొత్తం రాయలసీమ లో వర్షాభావ పరిస్థితులు చుట్టూ తిరుగుతుందని చెప్తున్నారు.  

పది రోజుల పాటు దుబాయ్ లో గడిపిన  మహేష్ బాబు, నమ్రత, గౌతమ్ మరియు సితార తిరిగి ఈ వారంలో హైదరాబాద్ రానున్నారు.   రాగానే 'మహర్షి' సినిమా షూటింగ్ ఫైనల్  షెడ్యూల్   మొదలు కానుంది. ఈ షెడ్యూల్  కోసం మహేష్ బాబు టీమ్ తో కలిసి  పొల్లాచి వెళ్లనున్నారు. ఈ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ పూర్తి అయిపోతుంది.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో పూజా హెగ్డే  హీరోయిన్ గా నటిస్తున్నారు. ‘అల్లరి’ నరేశ్‌ కీలక పాత్రధారి. అశ్వనీదత్, ‘దిల్‌’ రాజు, పీవీపీ నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్‌ 5న విడుదల కానుంది. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు.