Guntur Kaaram : ‘గుంటూరు కారం’ సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఎంతో తెలుసా?
మహేశ్ బాబు - త్రివిక్రమ్ కాంబోలోని ‘గుంటూరు కారం’ రిలీజ్ కు అన్నీ ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు ముగిశాయి. ఇందుకు సంబంధించిన డిటేయిల్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి.
సూపర్ స్టార్ మహేశ్ బాబు Mahesh Babu - స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ Trivikram కాంబోలో వస్తున్న మాస్ యాక్షన్ ఫిల్మ్ ‘గుంటూరు కారం’. Guntur Kaaram. వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. ఈ క్రేజీ కాంబోలో 13 ఏళ్ల తర్వాత వస్తున్న చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చిత్రాన్ని హారిక అండ్ హాసిని బ్యానర్ పై రూపొందిస్తున్న విషయం తెలిసిందే.
మేకర్స్ ఇప్పటికే ప్రచార కార్యక్రమాలనూ జోరుగా నిర్వహిస్తూనే ఉన్నారు. మరోవైపు రిలీజ్ కూ అన్నీ ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. తాజాగా సెన్సార్స్ బోర్డ్ నుంచి కూడా సర్టిఫికెట్ అందింది. ‘గుంటూరుకారం’ చిత్రానికి బోర్డు U/A సర్టిఫికెట్ ను అందించడం విశేషం. అంటే, 12 ఏళ్ల లోపు పిల్లలు పేరెంట్స్ గైడ్ లైన్స్ తో చూడాల్సి ఉంటుంది.
సెన్సార్ కార్యక్రమాలు పూర్తవడంతో ప్రమోషన్స్ ను మరింత జోరుగా నిర్వహించనున్నారు యూనిట్. ఇప్పటి వరకు గ్లింప్స్, సాంగ్స్ మాత్రమే అందాయి. నెక్ట్స్ రాబోయే టీజర్, ట్రైలర్ పై అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ఇక ఈ చిత్రం రన్ టైమ్ విషయానికొస్తే... 2 గంటల 42 నిమిషాల నిడివి ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రం చివరి 45 నిమిషాలు వేరే లెవల్లో ఉంటుందని ఇప్పటికే నిర్మాత హైప్ పెంచారు.
టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీలా Sreeleela హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా వచ్చిన ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్ లో మహేశ్ బాబుకు ధీటుగా స్టెప్పులేసింది. బాబు కూడా దుమ్ములేపడం ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తోంది. సెకండ్ హీరోయిన్ గా మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) నటిస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.