సూపర్ స్టార్ మహేశ్జ్ బాబు టాలీవుడ్ లో అగ్ర నటుడిగా దూసుకుపోతున్నాడు. మహేష్ నుంచి వరుసగా విజయవంతమైన చిత్రాలు వస్తున్నాయి. టాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోల్లో మహేష్ ముందు వరుసలో ఉంటాడు. కేవలం సినిమాలతోనే కాకుండా, వాణిజ్య ప్రకటనలు, వ్యాపారాలతో మహేష్ చేతినిండా సంపాదిస్తున్నాడు. 

గత ఏడాది మెహెష్ బాబు మల్టిఫ్లెక్స్ బిజినెస్ లోకి దిగిన సంగతి తెలిసిందే. ఏఎంబి సినిమాస్ పేరుతో హైదరాబాద్ లో అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన మల్టిఫ్లెక్స్ లో మహేష్ భాగస్వామి. గత ఏడాది ఏఎంబి సినిమాస్ ప్రారంభమైంది. 

తాజాగా ఏఎంబి సినిమాస్ ఓ ఘనత సాధించింది. బిగ్ సినీ అవార్డ్స్ లో భాగంగా ఏఎంబి సినిమాస్ బెస్ట్ మల్టిఫ్లెక్స్ గా అవార్డు సొంతం చేసుకుంది. దీనితో సూపర్ స్టార్ మహేష్ సూపర్ హ్యాపీగా ఉన్నాడు. ఏఎంబి సినిమాస్ బెస్ట్ మల్టిఫ్లెక్స్ అవార్డు సొంతం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఏఎంబి సినిమాస్ టీంకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు అని మహేష్ బాబు ట్వీట్ చేశాడు.