సినిమా ఇండస్ట్రీలో షూటింగ్ ల కోసం హీరోలు ఇతర ప్రదేశాలకు వెళ్తుంటారు. లేదంటే హైదరాబాద్ లోనే సెట్ లు వేసి షూటింగ్ కానిచ్చేస్తుంటారు. చాలా మంది హీరోలు అవుట్ డోర్ షూటింగ్ అంటే పెద్దగా అభ్యంతరం చెప్పరు. స్టార్ హీరోలు సైతం దీనికి అతీతం కాదు.

కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం అవుట్ డోర్ షూటింగ్ అంటే రావడానికి మొరాయిస్తున్నాడట. దానికి బదులుగా సెట్ వేయాలని నిర్మాతలను డిమాండ్ చేస్తున్నాడని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. 'మహర్షి' సినిమాలో కొన్ని సన్నివేశాలు పల్లెటూరి  నేపధ్యంలో తీయాల్సి వచ్చింది.

దీంతో తూర్పు గోదావరి జిల్లాలో కానీ, లేదంటే కేరళలో తీయాలని భావించిందట చిత్రబృందం. అయితే మహేష్ బాబు దానికి నో చెప్పినట్లు తెలుస్తోంది. మహేష్ కోసమే ప్రత్యేకంగా హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో పల్లెటూరి సెట్ వేశారు. దానికి కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. సినిమాలో ఓ సన్నివేశం కోసం రాయలసీమ ప్రాంతంలో బీడువారిన భూమిని చూపించాల్సి వచ్చిందట.

ఆఖరికి దానికోసం కూడా చాలా ఖర్చు పెట్టి సెట్ వేశారట. మహేష్ లాంటి హీరోలు అవుట్ డోర్ వెళ్తే అక్కడ అభిమానుల తాకిడిని తట్టుకోలేరు. అది నిజమే కానీ దానికోసం కోట్లు, కోట్లు ఖర్చు పెట్టి నిర్మాతలతో సెట్టింగులు వేయిస్తుండడంఎంత వరకు సబబు. సినిమా హిట్ అయి పెట్టిన మొత్తం తిరిగి వచ్చేస్తే మంచిదే కానీ సినిమా కాస్ట్ ఫెయిల్యూర్ అయితే ఆ బాధ్యత వహించాల్సింది నిర్మాతే కదా..!