Asianet News TeluguAsianet News Telugu

‘డార్క్’ వెబ్ సిరీస్ పై మహేష్ షార్ట్ రివ్యూ!!

కూతురు సితార, కుమారుడు గౌతమ్ లతో కలిసి సరదా ఆటలు ఆడుతూ, అలానే పలు సినిమాలు, వెబ్ సిరీస్ ల వంటివి చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. ఇకపోతే ఈ రోజు ప్రముఖ ఓటిటి మధ్యమం నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం అయ్యే జర్మన్ బేస్డ్ వెబ్ సిరీస్ ‘డార్క్’ ఎంతో బాగుంది అంటూ సూపర్ స్టార్ మహేష్ తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఒక పోస్ట్ చేసారు.

Mahesh Babu recommends Dark series
Author
Hyderabad, First Published Jul 9, 2020, 10:36 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు, ఈ లాక్ డౌన్ సమయాన్ని తన ఫ్యామిలీతో కలిసి సరదాగా గడుపుతున్న సంగతి తెలిసిందే. కూతురు సితార, కుమారుడు గౌతమ్ లతో కలిసి సరదా ఆటలు ఆడుతూ, అలానే పలు సినిమాలు, వెబ్ సిరీస్ ల వంటివి చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. ఇకపోతే ఈ రోజు ప్రముఖ ఓటిటి మధ్యమం నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం అయ్యే జర్మన్ బేస్డ్ వెబ్ సిరీస్ ‘డార్క్’ ఎంతో బాగుంది అంటూ సూపర్ స్టార్ మహేష్ తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఒక పోస్ట్ చేసారు.

‘అద్భుతమైన కథ, కథనాలతో ఆకట్టుకునే స్క్రిప్ట్ తో రూపొందించబడ్డ డార్క్ వెబ్ సిరీస్ తనకు ఎంతో నచ్చిందని, వీలైతే మీరు కూడా దానిని చూడండి’ అంటూ మహేష్ తన ట్వీట్ ద్వారా ప్రేక్షకులకు తెలిపారు సూపర్ స్టార్. దాంతో మహేష్ అభిమానులు చాలా మంది ఇప్పుడు డార్క్ పై పడ్డారు. డార్క్ వెబ్ సీరిస్ ...టైమ్ ట్రావిలింగ్ పై ఆధారపడి డిజైన్ చేసింది. చాలా కాంప్లికేటెడ్ గా ఉన్న ఈ వెబ్ సీరిస్ ని జర్మనీలో నిర్మించారు. నెట్ ప్లిక్స్ లో సూపర్ హిట్ అయిన సీరిస్ ఇది.

డార్క్ వెబ్ సీరిస్ లో ఇద్దరు టీనేజ్ పిల్లలు మాయమైపోతారు. దాంతో వారి కుటుంబాలు వారి కోసం వెతకటం మొదలవుతాయి. ఈ క్రమంలో అనేక ప్లాష్ బ్యాక్ లు వస్తాయి. అయితే ఈ సీరిస్ చూడాలంటే అంతర్నేత్రం ఉండాలి, అలాగే షార్ప్ మైండ్ కూడా ఉండాలి. ఎందుకంటే రకరకాల టైమ్స్ లైన్స్, వేర్వేరే రిలేషన్స్ తో నడుస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా సూపర్ హిట్టైన సీరిస్ ఇది.

Follow Us:
Download App:
  • android
  • ios