మహేష్‌బాబు అరుదైన ఘనత సాధించారు. ఆయన ఫాలోయింగ్‌లో మరో రేర్‌ ఫీట్‌ని సాధించారు. అక్కడ ఏకంగా అరవై లక్షల మంది ఫాలో అవుతున్నారు. అది ఎక్కడో కాదు ఇన్‌స్టాగ్రామ్‌లో. ఆయన్ని ఇన్‌స్టాలో ఫాలోఅవుతున్న వారి అభిమానుల సంఖ్య అరవై లక్షలు(ఆరు మిలియన్స్) దాటింది. ఇంతటి రేర్‌ ఫీట్‌ సాధించడంతో మహేష్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆయన అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. 

ఇన్‌స్టాలో ఆరు మిలియన్‌ ఫాలోవర్స్ ఉండగా, ట్విట్టర్‌లో ఇప్పటికే మహేష్‌ పది మిలియన్స్ దాటారు. మహేష్‌ ఎప్పటికప్పుడు తన సినిమా అప్‌డేట్‌లు, ఫ్యామిలీ ఫోటోలను పంచుకుంటూ అభిమానులను ఖషీ చేస్తున్నారు. అంతేకాదు సామాజిక అంశాలు, సహాయం చేయడం, అభినందలు తెలపడంలో ఇప్పుడు సమాజిక మాధ్యమాలను బాగా వాడుతున్నారు మహేష్‌. టాలీవుడ్‌ హీరోల్లో అల్లు అర్జున్‌ తర్వాత  ఇంతటి ఘనతని సాధించిన స్టార్‌గా మహేష్‌ నిలవడం విశేషం. అల్లు అర్జున్‌ 9మిలియన్స్ కిపైగా ఫాలోవర్స్ ఉన్నారు.

ప్రస్తుతం మహేష్‌ `సర్కారు వారి పాట` చిత్రంలో నటిస్తున్నారు. ఇది త్వరలో ప్రారంభం కాబోతుంది. కీర్తిసురేష్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. జనవరి నుంచి ఇది రెగ్యులర్‌ షూటింగ్‌ని ప్రారంభించుకోనుంది.