ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు తొలి కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ‘SSMB29’. ఆర్ఆర్ఆర్ లాంటి ఆస్కార్ విజయం సాధించిన మూవీ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఇదే.

ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు తొలి కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ‘SSMB29’. ఆర్ఆర్ఆర్ లాంటి ఆస్కార్ విజయం సాధించిన మూవీ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఇదే. ఈ భారీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ షూటింగ్ ప్రారంభ దశలోనే ఉండగా, ఓటీటీ రంగంలో రికార్డు స్థాయిలో డీల్ కుదిరినట్లు వార్తలు వస్తున్నాయి.

రికార్డు ధరకి SSMB29 ఓటీటీ హక్కులు 

అందుతున్న సమాచారం మేరకు ఓటీటీ దిగ్గజ సంస్థ నెట్‌ఫ్లిక్స్, ‘SSMB29’ చిత్రానికి డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అత్యధిక ధరకు సొంతంచేసుకున్నట్లు తెలుస్తోంది. ఇది భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే రికార్డ్ ఓటీటీ డీల్‌ అని అంటున్నారు. ‘RRR’ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఆకట్టుకోవడంతో, ఈ సంస్థ ‘SSMB29’ పై భారీ అంచనాలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇండియన్ సినిమా చరిత్రలోనే నెట్‌ఫ్లిక్స్‌ అత్యధిక ధర వెచ్చించి SSMB29 డిజిటల్ హక్కులు సొంతం చేసుకుందట. అయితే ధర ఎంతనేది బయటకి రాలేదు.  

ఇండియన్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న ప్రియాంక చోప్రా 

ఈ చిత్రంలో మహేష్ బాబుతో పాటు గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రియాంక చోప్రా ఈ చిత్రంతో భారతీయ సినిమాల్లోకి మళ్లీ రీఎంట్రీ ఇవ్వనుండడం విశేషం. ఈ చిత్రం "ఇండియానా జోన్స్" సిరీస్ నుంచి ప్రేరణ పొందిన గ్లోబ్-ట్రోట్టింగ్ యాక్షన్ అడ్వెంచర్ గా రూపొందుతోంది. ఈ కథను రాజమౌళి తండ్రి, లెజెండరీ రచయిత విజయేంద్ర ప్రసాద్ అందించారు.

ఈ చిత్రాన్ని సుమారు రూ.1000 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. కెఎల్ నారాయణ ఈ చిత్రానికి నిర్మాత. మ్యూజిక్ డైరెక్టర్‌గా ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి పని చేస్తున్నారు. ఈ చిత్ర కథలో హిందూ పురాణాలకు సంబంధించిన అంశం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఆంజనేయ స్వామి, సంజీవని పర్వతానికి సంబంధించిన అంశాలు ఈ చిత్రంలో అంతర్లీనంగా ఉండబోతున్నట్లు టాక్.