Asianet News TeluguAsianet News Telugu

అసలు 'పూనకాలు' లోడింగ్ మహేష్ ఫ్యాన్స్ కే, ఎక్కడ చూసినా అదే టాపిక్

  ఈ సినిమా గురించిన సెన్సేషనల్ బజ్  వైరల్ గా మారింది. ఈ వార్త వచ్చినప్పటినుంచీ అభిమానులు పూనకాలు వచ్చినట్లుగా ఊగిపోతున్నారు. 

Mahesh Babu, Rajamouli combo Will Have Sequels!
Author
First Published Dec 31, 2022, 1:49 PM IST


మహేష్ అభిమానులు మాంచి ఊపు మీద ఉన్నారు. అందుకు ప్రత్యేక కారణం ఉంది.  ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్న రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించిన అఫీయల్ గా ప్రకటన వెలువడలేదు కానీ అటు మహేష్ బాబు ఇటు రాజమౌళి ఇద్దరూ కూడా తాము కలిసి సినిమా చేస్తున్నామనే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. దాంతో ఈ సినిమా పై ఏ చిన్న బజ్ వచ్చినా ఇది అభిమానుల్లో,  సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. తాజాగా  ఈ సినిమా గురించిన సెన్సేషనల్ బజ్  వైరల్ గా మారింది. ఈ వార్త వచ్చినప్పటినుంచీ అభిమానులు పూనకాలు వచ్చినట్లుగా ఊగిపోతున్నారు. 

అదేమిటంటే..దర్శకుడు రాజమౌళి ఆయన  టీమ్ కలిసి  ఈ బిగ్గెస్ట్ అడ్వెంచరస్ డ్రామా ని ఫ్రాంచైజ్ లా అనేక సీక్వెల్స్  గా చేయాలని చూస్తున్నారట. ఈ సినిమాకి స్టోరీ డెవలప్ చేస్తున్న పాన్ ఇండియా రచయితా రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ లేటెస్ట్ గా బాలీవుడ్ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఈ సినిమాని ఓ సెన్సేషనల్ ఫ్రాంచైజ్ లా ప్లాన్ చేసే అవకాశం ఉందని వెల్లడి చేశారు.

అంతే కాకుండా ఇప్పుడు తన టీం తో ఫస్ట్ పార్ట్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారని తెలిపారు. దీనితో ఈ క్రేజీ అప్డేట్ సినీ వర్గాల్లో పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. ఇక ఈ సినిమా అయితే వచ్చే ఏడాది సమ్మర్ నుంచి షూటింగ్ స్టార్ట్ కానుంది. అలాగే ఇది కంప్లీట్ ఏక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ గా రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు. ఇదే జరిగితే మహేష్ ఈ సినిమాతో ఏ  స్దాయి వరకూ వెళ్తాడో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. 

అలాగే ఆ మధ్యన టొరంటో ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొన్న రాజమౌళి అక్కడే తన తదుపరి చిత్రానికి సంబంధించిన విశేషాలను పంచుకున్నారు. టోరెంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొన్న రాజమౌళి మహేష్ బాబుతో చేసే సినిమా ఒక యాక్షన్ అడ్వెంచర్ మూవీ అని ప్రపంచాన్ని చుట్టి వచ్చే ఒక ప్రపంచ యాత్రికుడి కధ అని ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో రూపొందించబోతున్నామని ఆయన అన్నారు. 

ప్రపంచ యాత్రికుడి లాగా కనిపించబోతున్న మహేష్ బాబు ఎలాంటి యాక్షన్ అడ్వెంచర్స్ చేస్తారనేది ఆసక్తికరంగా మారనుంది. ప్రస్తుతానికి ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని తెలుస్తోంది. త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ ముగిసిన తర్వాత సినిమాకు సంబంధించిన పనులు ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ఇక ఈ సినిమాని కేఎల్ నారాయణ నిర్మించబోతున్నారు. ఈ సినిమాకి కూడా రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్నారు. దీనికోసం ఆయన రెండు కథలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఒకటి అమెజాన్ అడవులలో ఉన్న నిధి వేట అంటే ఒక ట్రెజర్ హంట్ లాంటి కధ సిద్ధం చేయగా మరొకటి జేమ్స్ బాండ్ తరహా అడ్వెంచర్స్ కథ అని తెలుస్తోంది. అయితే ఇందులో రాజమౌళి చెబుతున్న దాన్ని బట్టి చూస్తే జేమ్స్ బాండ్ తరహా కథకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

ఇప్పుడు అయితే మహేష్ దర్శకుడు త్రివిక్రమ్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు త్రివిక్రమ్ తో తన 28వ సినిమా చేస్తున్నాడు. హారిక హాసిని బ్యానర్ మీద భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ తరువాత మహేష్ బాబు రాజమౌళితో సినిమా ప్రారంభించనున్నారు. అయితే తాజాగా మహేష్ బాబుతో చేసే సినిమా గురించి రాజమౌళి ఆసక్తికర విషయాలు బయట పెట్టారు.

Follow Us:
Download App:
  • android
  • ios