Asianet News TeluguAsianet News Telugu

హైప్ క్రియేట్ చేయకుండా స్పైడర్ పబ్లిసిటీ వుండాలన్న మహేష్

  • అనుకున్నంత మొదలుకాని స్పైడర్ మూవీ పబ్లిసిటీ
  • పబ్లిసిటీ ఎక్కువైతే హైప్ ఎక్కువవుతుంది కాబట్టి అంచనాలు పెంచొద్దని ప్లాన్
  • అంచనాలు పెంచితే తేడా వస్తే ఇబ్బందులు ఎదురౌతాయని పబ్లిసిటీకి దూరం
mahesh babu publicity strategy for spyder is to reduce hype

దసరా రేసులో వారం ముందుగానే వచ్చిన ‘జై లవ కుశ’ బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే సందడి చేస్తోంది. వారం తేడాతో రానున్న ‘స్పైడర్’ మరో మూడు రోజులలో థియేటర్స్ లో సందడి చేయనుంది. అయితే.. మహేష్ బాబు సినిమా అంటే భారీ అంచనాలుంటాయి. పబ్లిసిటీ కూడా అదే రేంజ్ లో వుంటుంది. కానీ ఎప్పుడూ లేని విధంగా మహేష్ సినిమా పబ్లిసిటీకి సంబంధించి మౌనం వెనుక మరో కోణం వుందని అంటున్నారు. మహేష్ గత చిత్రాలు ‘శ్రీమంతుడు’ ‘బ్రహ్మోత్సవం’ సినిమాలకు సంబంధించి ఆ సినిమాల విడుదలకు ఒక వారం రోజులు ముందుగానే భారీ స్థాయిలో పబ్లిసిటీ చేసారు.

 

అయితే గతానికి భిన్నంగా ‘స్పైడర్’ టీమ్ మాత్రం మౌనంగా ఉండిపోవడానికి ఈసినిమా పై అంచనాలు తగ్గించడానికే అన్న ప్రచారం జరుగుతోంది. ఈమధ్య కాలంలో టాప్ హీరోల సినిమాల పై అంచనాలు ఆ సినిమాలను బాగా దెబ్బ తీస్తున్నాయన్న అభిప్రాయంతో మహేష్ మురగదాస్ లు ‘స్పైడర్’ పబ్లిసిటీ విషయంలో వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు అన్న కామెంట్స్ ఉన్నాయి. అయితే ఈరోజు ఆదివారం నుండి మీడియా ఛానల్స్ లో మహేష్, రకుల్, మురుగదాస్ ఇంటర్వ్యూలు ఉంటాయని సమాచారం లభిస్తున్నప్పటికీ, వాటికి సంబంధించిన ప్రోమోలు మాత్రం ఇప్పటివరకు విడుదల కాలేదు. 

 

అంచనాలను తగ్గించాలన్న ఆలోచన సరైనదే అయినప్పటికీ అసలు ఏ మాత్రం పబ్లిసిటీ చేయకపోతే ప్రేక్షకులకు చేరువ అవటం కూడా కష్టమేనన్న అభిప్రాయం మహేష్ అభిమానులలో వ్యక్తం అవుతోంది. దీనికితోడు ‘జై లవ కుశ’ ఇప్పటికే కలెక్షన్స్ ప్రవాహంలో దూసుకుపోతున్న నేపధ్యంలో పబ్లిసిటీ విషయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా అది ‘స్పైడర్’ కు శాపంగా మారే అవకాశం ఉంది అని అంటున్నారు. దీనికితోడు ‘జై లవ కుశ’ ముందుగానే విడుదల కావడంతో ‘స్పైడర్’ కు కోరుకున్న స్థాయిలో థియేటర్లు దొరకడం లేదు అని అంటున్నారు. ఏమైనా మహేష్ మురగదాస్ ల వ్యూహాలు మహేష్ అభిమానులే కాకుండా ‘స్పైడర్’ బయ్యర్లను కూడ కంగారు పెడుతున్నాయి. అయితే మూడు రోజుల ముందు నించి పబ్లిసిటీ పెంచుతాామని మూవీ టీమ్ చెప్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios