సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు బుధవారం తిరిగి షూటింగ్‌ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. చివరగా ఆయన `సరిలేరు నీకెవ్వరు` సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ లెక్కన ఆయన షూటింగ్‌ ఆపేసి దాదాపు ఎనిమిది నెలలు అవుతుంది. 

తన తండ్రి,సూపర్‌ స్టార్‌ కృష్ణ బర్త్ డే సందర్భంగా తన కొత్త సినిమా `సర్కారు వారి పాట`ని ప్రకటించారు. కానీ వైరస్‌ వల్ల ఈ సినిమా షూటింగ్‌ ఇంకా ప్రారంభించలేదు. తాజాగా ఎనిమిది నెలల తర్వాత బుధవారం ఓ యాడ్‌ కోసం తిరిగి షూటింగ్‌లో పాల్గొన్నారు మహేష్‌. అన్నపూర్ణ స్టూడియోలో ఈ యాడ్‌ని చిత్రీకరించారు. 

తాజాగా ఈ యాడ్‌ చిత్రీకరణ ప్యాకప్‌ సమయంలో దిగిన ఓ ఫోటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. బ్లాక్‌ అండ్‌ వైట్‌లో, పెంచిన జుట్టుతో మహేష్‌ లుక్‌ ఉంది. తన నెక్ట్స్ సినిమా లుక్‌ ఇదే అని ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే `సర్కారు వారి పాట` ఫస్ట్ లుక్‌లో మహేష్‌ జుట్టు కాస్త పెద్దగానే కనిపిస్తుంది. దానికి బలం చేకూరేలాగా ఈ లుక్‌ ఉండటం విశేషం.

యాడ్‌ ప్యాకప్‌ టైమ్‌లో దించిన ఈ ఫోటోని ప్రముఖ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్‌ అవినాష్‌ గోవారికర్‌ ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నారు. దీన్ని మహేష్‌ రిప్లైగా స్పందిస్తూ, `ప్యాకప్‌  షాట్‌ పోస్ట్ ని మిస్‌ అయ్యాను. తిరిగి షూటింగ్‌ ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది` అని మహేష్‌ ట్వీట్‌ చేశారు. ఇక మహేష్‌ నటిస్తున్న `సర్కారు వారి పాట`కి పరశురామ్‌ దర్శకత్వం వహిస్తుండగా, కీర్తిసురేష్‌ని హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టు టాక్‌.