మహేష్ బాబు 25వ సినిమా మహర్షి ప్రేక్షకుల ముందుకు వచ్చేవరకు ప్రమోషన్స్ డోస్ తగ్గేలా లేదు. మొన్నటివరకు చప్పుడు లేదన్న విమర్శకులకు సింపుల్ పిక్స్ తోనే ఓ రేంజ్ లో ప్రచారాలను కోనసాగిస్తున్నారు. వచ్చిన ఒక్క సాంగ్ సూపర్ స్టార్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. 

ఇక మహేష్ కెమెరా బ్యాక్ సైడ్ స్టిల్స్ తో రచ్చ మొదలెట్టాడు. ఇటీవల సీతార పాపతో మహేష్ ఉన్న ఫొటోలు కూడా ఇంటర్నెట్ లో తెగ వైరల్ అయ్యాయి. మహేష్ తన కూతురిని చూస్తూ మురిసిపోతున్న తీరుకు అభిమానులు ఫిదా అయిపోయారు. 

ఇప్పుడు సింపుల్ గా స్టైలిష్ షర్ట్ లో చెయిర్ పై కూర్చొని ఉన్న ఫోటో కూడా క్లాస్ ఆడియెన్స్ ను తెగ ఆకర్షిస్తోంది. చూస్తుంటే మహర్షి సింపుల్ ప్రమోషన్స్ తో సినిమా రేంజ్ ను పెంచుతున్నట్లు అర్ధమవుతోంది. మరి నెక్స్ట్ ఎలాంటి ఫొటోస్ తో సూపర్ స్టార్ దర్శనమిస్తారో చూడాలి.