మహేష్ చిత్రానికి సంభవామి యుగే యుగే టైటిల్ ఖరారు అధికారికంగా ప్రకటించేందుకు సిద్ధమవుతున్న యూనిట్
మహేష్ బాబు తాజాగా మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే . ఆ చిత్రం ప్రస్తుతం ముంబై లో షూటింగ్ జరుపుకుంటోంది. చిత్రానికి ఇప్పటివరకు టైటిల్ నిర్ణయించలేదు . అయితే పలు రకాల టైటిల్స్ ప్రచారంలో మాత్రం ఉన్నాయి అందులో ఒకటి '' సంభవామి యుగే యుగే '' . మహేష్ బాబు చిత్రానికి సంభవామి యుగే యుగే టైటిల్ పెట్టినట్లుగా ప్రముఖ్ నిర్మాత పివిపి నిన్న ఓ ఈవెంట్ లో పాల్గొన్న సందర్బంగా ప్రకటించిన నేపథ్యంలో మహేష్ టైటిల్ అదే అని ప్రచారం సాగడంతో అది అఫీషియల్ కన్ఫర్మేషన్ కాదని మళ్ళీ ప్రకటించారు .
అయితే ప్రస్తుతం వినబడుతున్న కథనం ప్రకారం సంభవామి యుగే యుగే అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు కానీ ఆ చిత్ర బృందం మాత్రమే అధికారికంగా ప్రకటిస్తారట దాంతో పివిపి ప్రకటించిన టైటిల్ అఫీషియల్ కాదు అంటూ జరిగిన దానికి నష్టం జరుగకుండా చెప్పుకొచ్చారు . మొత్తానికి టైటిల్ హడావుడి మామూలుగా లేదు. ఇక మూవీ ఏ రేంజ్ లో హడావుడి చేస్తుందో మరి.
