సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు కథానాయకుడుగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ మరియు వైజయంతీ మూవీస్‌ పతాకాలపై ప్రముఖ నిర్మాతలు సి.అశ్వనీదత్‌, దిల్‌రాజు నిర్మాతలుగా ఓ భారీ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు అనేది ఇప్పటి వరకు ఖరారు కాలేదు. అయితే ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఇలియానాను తీసుకోనున్నట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

 దీనిపై నిర్మాత దిల్ రాజు స్పందించారు.మహేష్ బాబుతో తాము చేస్తున్న సినిమాలో ఇలియానా హీరోయిన్ అనే వార్తల్లో నిజం లేదని, అసలు ఇలియానాను తాము సంప్రదించలేదని చిత్ర నిర్మాత దిల్ రాజు పేర్కొన్నారు. త్వరలో అఫీషియల్‌గా ప్రకటిస్తామని తెలిపారు .తెలుగు సినిమా ఇండస్ట్రీలోని రెండు పెద్ద బేనర్లు, ఇద్దరు పెద్ద నిర్మాతలు కలిసి తీస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.

 మహేష్ బాబు కెరీర్లోనే ఈ చిత్రం బిగ్గెస్ట్ చిత్రంగా తెరకెక్కబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.షూటింగ్‌ ముహూర్తం ఆగస్ట్‌ 14న అన్నపూర్ణ స్టూడియోలో వైభవంగా ప్రారంభం అయింది. మహేష్‌ తనయుడు ఘట్టమనేని గౌతమ్‌ క్లాప్‌ నివ్వగా, కుమార్తె ఘట్టమనేని సితార కెమెరా స్విచ్‌ ఆన్‌ చేశారు. మహేష్ బాబు సినిమాలకు ఆయన పిల్లలు ఇలాంటి బాధ్యతలు నిర్వర్తించడం ఇదే తొలిసారి.