మహర్షి తర్వాత మహేష్ బాబు కొత్త చిత్రం ప్రారంభమైంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటిస్తున్నాడు. ఇటీవల ఈ చిత్ర షూటింగ్ కాశ్మీర్ లో ప్రారంభమైంది. మహేష్ బాబు ఈ చిత్రంలో ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. మహేష్ డ్రెస్ లో ఉండే ఫొటోస్ కూడా వైరల్ అయ్యాయి. 

తాజాగా ఈ చిత్రంలో మహేష్ బాబు పాత్ర పేరు తెలిసింది. ఈ చిత్రంలో మహేష్ బాబు 'మేజర్ అజయ్ కృష్ణ'గా నటిస్తున్నాడు. తనమహేష్ బాబు పాత్ర పేరులో తన తండ్రి పేరు ఉండడం అభిమానులని సంతోషానికి గురిచేసే అంశం. పోకిరి తర్వాత మహేష్ బాబు మరోసారి కృష్ణ పేరుతో నటిస్తున్నాడు. 

పోకిరి చిత్రంలో కృష్ణ మనోహర్ ఐపీఎస్ గా మహేష్ బాబు  చేసిన రచ్చ అంతా కాదు. పూరి జగన్నాధ్ సినిమా చివరి వరకు మహేష్ బాబు అసలు పేరుని రివీల్ చేయలేదు. సరిలేరు నీకెవ్వరులో మహేష్ పేరు ముందే బయటకు వచ్చేసింది. అనిల్ రావిపూడి ఈ చిత్రంలో దేశభక్తితో పాటు, కామెడీకి కూడా ప్రాధాన్యత ఇస్తున్నాడట. 

రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.  దిల్ రాజు, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం 2020 సంక్రాంతికి రిలీజ్ కానుంది.