మహేష్‌బాబు, ఏషియన్స్ సినిమాస్‌తో కలిసి హైదరాబాద్‌లో ఏఎంబీ(ఏషియన్‌-మహేష్‌బాబు) మల్టీఫ్లెక్స్ ని నిర్మించిన విషయం తెలిసిందే. రెండేళ్ల క్రితం ఇది ప్రారంభమైంది. అత్యాధునిక సదుపాయాలతో, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో, అత్యంత లగ్జరీగా ఈ మల్టీఫ్లెక్స్ ని నగరంలో గచ్చిబౌలిలో దీన్ని రూపొందించారు. అంతర్జాతీయ స్థాయిలో ఇంటీరియర్ డిజైన్‌తో మొత్తం 1638 సీట్ల సామర్థ్యంతో ఈ మల్టీప్లెక్స్ ఏర్పాటు చేశారు. వీవీఐపీ లాంజ్, పార్టీ జోన్, స్పెషల్ కిడ్స్ జోన్, లగ్జరీ సీటింగ్ తదితర సదుపాయాలతో `ఏఎంబీ సినిమాస్` ప్రేక్షకులకు వరల్డ్ క్లాస్ అనుభూతిని కలిగిస్తోంది. 

తాజాగా దీనికి అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. `ఇనవేషన్ అవార్డ్స్-2021`లో గ్లోబల్ గుర్తింపును పొందినట్లు తాజాగా ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇనవేషన్ అవార్డ్స్-2021లో లీజర్ అండ్ ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో ఏఎంబీ సినిమాస్ ఫైనలిస్టుగా ఎంపికవడం విశేషం. ఎవి ఇంటిగ్రేషన్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ వారు ఈ కేటగిరీలో భారతదేశం నుండి  `ఏఎంబీ సినిమాస్` మల్టీప్లెక్స్‌ని మాత్రమే సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ సోషల్ మీడియా వేదికగా AMB సినిమాస్ బృందానికి అభినందనలు తెలియజేస్తూ, ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు.