సూపర్ స్టార్ మహేష్ బాబు 106 ఏళ్ల వయసున్న బామ్మ తన మనసుని గెలుచుకుందని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. రాజమహేంద్రవరానికిచెందిన రేలంగి సత్యవతి అనే బామ్మ మహేష్ బాబు అభిమాని. అతడిని చూడడానికి ఆమె హైదరాబాద్ కి వచ్చారట.

ఈ విషయాన్ని వెల్లడిస్తూ మహేష్ తన సోషల్ మీడియా ఖాతాలో ఓ ఫోటోని పంచుకున్నారు. ''ఎన్నేళ్లు గడుస్తున్నా నాపై ఉన్న ప్రేమ ఎక్కువవ్వడం చూస్తుంటే ఆనందంగా అనిపిస్తుంది. అభిమానులు నాపై చూపే ప్రేమ, అభిమానం నాకెప్పుడూ సంతోషాన్ని కలిగిస్తాయి.

106 ఏళ్ల ఈ బామ్మ నాకోసం రాజమహేంద్రవరం నుండి నన్ను కలవడానికి వచ్చి ఆమె దీవెనలు నాకు అందించడం ఆనందాన్ని కలిగించింది. ఆమె తన అభిమానంతో నా మనసు 
గెలుచుకున్నారు. నిజం చెప్పాలంటే నన్ను కలిసినందుకు ఆమె కంటే నేనే ఎక్కువగా సంతోషపడుతున్నాను.

దేవుడు దీవెనలు ఆమెపై ఉండాలి'' అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం మహేష్ బాబు.. వంశీపైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.