సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న 'మహర్షి' సినిమా ఏప్రిల్ లో విడుదలవుతుందని అన్నారు. కానీ ఇప్పుడు అనుకున్న సమయానికి వచ్చే అవకాశాలు లేవని సన్నిహిత వర్గాల సమాచారం. 

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న 'మహర్షి' సినిమా ఏప్రిల్ లో విడుదలవుతుందని అన్నారు. కానీ ఇప్పుడు అనుకున్న సమయానికి వచ్చే అవకాశాలు లేవని సన్నిహిత వర్గాల సమాచారం. ఈ సినిమా మే 9న విడుదలయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్ 25న సినిమా విడుదల కష్టమని చిత్రబృందం భావిస్తోంది.

సినిమా షూటింగ్ పనులు పూర్తవ్వడానికే ఏప్రిల్ 15 వరకు టైం పడుతుంది. అందుకే ఈ విషయంలో మహేష్ ని కన్విన్స్ చేయాలని చూస్తున్నారు. మహేష్ మాత్రం ఏప్రిల్ 25న సినిమా థియేటర్లలోకి రావాల్సిందేనని పట్టుబడుతున్నాడు.

ఆ కారణంగానే చిత్రబృందం సోషల్ మీడియాలో ఏప్రిల్ 25న రిలీజ్ అంటూ అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితుల బట్టి సినిమా అనుకున్న సమయానికి రాదనేది తేలిపోయింది. దీంతో ఈ విషయాన్ని మహేష్ కి చెప్పి ఆయన్ని కన్విన్స్ చేసే బాధ్యతని దిల్ రాజు తీసుకున్నారు.

మరి దీనికి మహేష్ ఒప్పుకుంటాడా..? లేదా..? అనేది సందేహమే. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.