సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట క్రిస్మస్ సంబరాలు ముందే స్టార్ట్ అయ్యాయి. స్టార్ కిడ్ సితార సంబరాలను స్టార్ట్ చేసి..సోషల్ మీడియాలో అప్ డేట్ చేసింది.
టాలీవుడ్ స్టార్స్ లో మహేష్ బాబు సూపర్ స్టార్ అయితే.. సితార స్టార్ కిడ్ గా వైరల్ అవుతూ ఉంటుంది. ఆమె ఇప్పటికే సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. స్టార్ కిడ్ గా మహేష్ ఇమేజ్ తో ఎదగాలని చూడకుండా.. తన సొంత టాలెంట్ తో..ఎదుగుతూ వచ్చింది సితార. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడూ తన ఫోటోలు, పలు వీడియోలు షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతూ వస్తున్నారు. ప్రస్తుతం సితార ఇన్‌స్టా ఫాలోవర్స్ సంఖ్య 1.6 మిలియన్ వరకు చేరింది.
ఇక పండుగలు.. సందళ్లు చేయాలంటే సితార తరువాతే ఎవరైనా.. మహేష్ బాబు ఇంట సర్వమత సమ్మేళనం ఉంటుంది. అన్ని పండుగలకు సెలబ్రేట్ చేస్తారు. గతంలో వినాయక చవితి, దీపావళి, దసరా.. ఇలా అన్ని పండుగలు అద్బుతంగా చేసి... ఆ సమయంలో ఫెస్టివల్ సెలబ్రేషన్స్ కి సంబంధించిన పిక్స్ ని షేర్ చేస్తూ ఉంటుంది సితార. తాజాగా మహేష్ బాబు ఇంట క్రిస్మస్ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఒక వీడియోని షేర్ చేసింది. ఓ 20 రోజులు ముందు నుంచే మహేష్ ఇంట క్రిస్మస్ సంబరాలు స్టార్ట్ అయ్యాయి.
ఇక ఈ సందర్బంగా సితార కోసం మహేష్ బాబు ఇంటిలో క్రిస్టమస్ ట్రీని ఏర్పాటు చేశారు. ఇక ఆ క్రిస్మస్ ట్రీ ముందు సితార శాంటా క్లాస్ క్యాప్ పెట్టుకొని క్రిస్మస్ పాటకి రీల్ చేసింది. ఈ రీల్ ని తన ఇన్‌స్టాలో షేర్ చేయగానే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి సితార క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఇంకా గ్రాండ్ గా జరగబోతున్నాయి.
ఇక సితార టాలెంట్ గురించి తెలిసిందే. రకరకాల సినిమా పాటలకు తగ్గట్టు డాన్స్ లు చేస్తూ.. ఆడియన్స ను ఆకట్టుకుంటుంది సితా పాప. తన తండ్రి చేస్తున్న సమాజసేవలో భాగం పంచుకుంటూ.. వైరల్ న్యూస్ అవుతుంటుంది. ప్రతీ పండగను సెలబ్రేట్ చేస్తూ.. ఆ వీడియోలను తన ఫాలోవర్స్ తో పంచుకుంటుంది.
