ప్రస్తుతం ప్రభాస్ అంటే పాన్‌ ఇండియా స్టార్. బాహుబలి సినిమాతో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు ప్రభాస్‌. అయితే ప్రభాస్‌ కు హీరోగా స్టార్ ఇమేజ్‌ తీసుకువచ్చిన సినిమా మాత్రం వర్షం. శోభన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన వర్షం సినిమా ప్రభాస్ కెరీర్‌ను మలుపు తిప్పింది. ఈ సినిమాతో అమ్మాయిల కలల రాకుమారుడి మారిపోయాడు రెబల్ స్టార్‌. అయితే ఈ సినిమాకు ఫస్ట్‌ చాయిస్ ప్రభాస్ కాదట.

దర్శకుడు శోభన్‌, వర్షం సినిమా కథను ముందుగా సూపర్‌ స్టార్‌ మహేష్ బాబుకు చెప్పాడు అయితే మహేష్ ఆ సినిమా చేసేందుకు పెద్దగా ఇంట్రస్ట్‌ చూపించకపోవటంతో ప్రభాస్‌ దగ్గర వెళ్లింది. యాక్షన్‌, రొమాన్స్‌ భారీగా ఉన్న కథ కావటం ప్రభాస్‌ వెంటనే ఓకే చెప్పాశాడు. త్రిషా హీరోయిన్‌గా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఈ సినిమాతోనే ప్రభాస్‌ స్టార్ హీరోగా ఎదిగాడు.

వర్షం మిస్‌ కావటంతో తరువాత శోభన్ దర్శకత్వంలో బాబీ సినిమా చేశాడు మహేష్. అయితే ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఇక ప్రస్తుతం మహేష్ బాబు సర్కార్ వారి పాట సినిమాను ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాడు. ప్రభాస్‌ రాధే శ్యామ్‌ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమా పనులు కరోనా ప్రభావం తగ్గిన తరువాత ప్రారంభం కానున్నాయి.