మహేష్ బాబు తదుపరి సినిమా రిలీజ్ జూన్ లో మహేష్ మూవీ సమ్మర్ రిలీజ్ కు అడ్డం వస్తున్న బాహుబలి దీంతో జూన్ కు మహేష్ చిత్రం వాయిదా 

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబుహీరోగా ఎ.ఆర్‌.మురుగదాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్‌.వి.ప్ర‌సాద్‌, ఠాగూర్ మ‌ధులు భారీ బ‌డ్జ‌ెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్న ఈ సినిమాలో ర‌కుల్ ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. మ‌హేష్ ఈ చిత్రంలో ఇంట‌లిజెన్స్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌నున్నాడు. చిత్రాన్ని ఈ ఏడాది స‌మ్మ‌ర్‌లో విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు భావించారు.

అయితే వేస‌విలో అంటే ముందుగా మేలో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తామ‌నుకున్నారు. కానీ ఏప్రిల్‌లో చివ‌రి వార‌లో బాహుబ‌లి సినిమా విడుద‌ల ఉండ‌టంతో సినిమాను జూన్‌లో విడుద‌ల చేస్తే బెట‌ర్ అనుకుంటున్నార‌ని కూడా వార్త‌లు వస్తున్నాయి. ఇక్క‌డ మ‌రో విష‌య‌మేమంటే జూన్‌లో సినిమా అంటే వాన‌లు, స్కూల్స్ ఓపెనింగ్ ఉంటాయ‌ని, కాబ‌ట్టి మే నెలలోనే ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డం ఉత్త‌మ‌న‌ని కూడా నిర్మాత‌లు భావిస్తున్నారు. మ‌రి అధికార‌కంగా నిర్మాత‌లు ఎటువైపు మొగ్గుతారో చూడాలి.