ఇది మహేష్ బాబు ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. గుంటూరు కారం చిత్రం వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. సంక్రాంతికి విడుదల కష్టమే అంటున్నారు.  

దర్శకుడు త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోకి మంచి క్రేజ్ ఉంది. గతంలో వీరు కలిసి చేసిన అతడు, ఖలేజా మెప్పించాయి. బాక్సాఫీస్ సక్సెస్ తో సంబంధం లేకుండా ఈ చిత్రాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ముఖ్యంగా అతడు చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల ఫేవరెట్ మూవీ. త్రివిక్రమ్ మెగా కాంపౌండ్ కి దగ్గరయ్యాక మహేష్ తో గ్యాప్ వచ్చింది. ఏకంగా 13 ఏళ్ళ తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబోలో మూవీ సెట్ అయ్యింది. గుంటూరు కారం టైటిల్ తో ఈ చిత్రం తెరకెక్కుతుంది. 

కృష్ణ జయంతి సందర్భంగా గుంటూరు కారం టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ టీజర్ విడుదల చేశారు. విశేష స్పందన దక్కింది. అయితే గుంటూరు కారం చిత్రం విడుదల వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. 2024 సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అయితే షూటింగ్ అనుకున్న ప్రకారం జరగడం లేదు. షెడ్యూల్స్ లో మార్పులు జరగడంతో ఇతర నటుల డేట్స్ సమస్య వచ్చింది. 

జూన్ 12 నుండి కొత్త షెడ్యూల్ మొదలు కావాల్సి ఉండగా వెనక్కి పోయింది. కీలక నటులు బిజీగా ఉండగా మహేష్ రెడీగా ఉన్న షూటింగ్ వాయిదా పడుతుంది. చేసేది లేక నెక్స్ట్ షెడ్యూల్ జులైలో పెట్టుకున్నారట. దీంతో షూటింగ్ డిలే అయితే చెప్పినట్లు సంక్రాంతికి మూవీ విడుదల చేయగలరా అనే సందేహాలు మొదలయ్యాయి. 

గుంటూరు కారం చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీలీల మరో హీరోయిన్. థమన్ సంగీతం అందిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహేష్ ఊరమాస్ రోల్ చేస్తున్నట్లు సమాచారం.