Asianet News TeluguAsianet News Telugu

#Gunturkaaram ప్రీ రిలీజ్ బిజినెస్ (ఏరియావైజ్), ఎంతొస్తే బ్రేక్ ఈవెన్?

సినిమా అద్భుతంగా వచ్చింది. తమన్‌ మ్యూజిక్‌ మరోస్థాయిలో ఉండనుంది. ఫస్టాఫ్‌ రీరికార్డింగ్‌ పూర్తయింది. సంక్రాంతికి పర్‌ఫెక్ట్‌ మూవీ ఇది. ఫస్టాఫ్‌లో వచ్చే ఫైట్‌లో ఇద్దరు సూపర్‌స్టార్స్‌ను చూస్తున్న ఫీల్‌ కలుగుతుంది. 

Mahesh Babu #Gunturkaaram worldwide Pre Release Business and Breakeven jsp?
Author
First Published Jan 6, 2024, 7:48 AM IST


'చూడగానే మజా వస్తుంది, హార్ట్‌బీట్‌ పెరుగుతుంది, ఈల వేయాలనిపిస్తుంది. బ్లాక్‌బస్టర్‌ బొమ్మ లోడింగ్‌’ అని ‘గుంటూరు కారం’ (Guntur Kaaram)  నిర్మాత నాగవంశీ (Naga Vamsi)అంటున్నారు.ఈ సినిమాపై ధీమా వ్యక్తం చేశారు. సెన్సార్‌ బోర్డు ఈ చిత్రానికి యు/ఏ సర్టిఫికెట్‌ ఇచ్చింది.  మహేశ్‌బాబు (Mahesh babu) నటించిన కొత్త చిత్రం ‘గుంటూరు కారం’ (Guntur Kaaram). త్రివిక్రమ్‌ దర్శకుడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా  ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ పూర్తైంది. ఏ ఏరియాలో ఎంత బిజినెస్ అయ్యింది..బ్రేక్ ఈవెన్ ఎంత అనేది చూద్దాం. 

నైజాం – 42 Cr
సీడెడ్ – 14 Cr
ఉత్తరాంధ్ర - 14.5 Cr
ఈస్ట్ గోదావరి - 8.8 Cr
గుంటూరు — 7.8 Cr
వెస్ట్ గోదావరి – 6.5 Cr
కృష్ణా  — 6.5 Cr
నెల్లూరు — 4 Cr
ఆంధ్రా/తెలంగాణా  — 104.1 Cr
రెస్టాఫ్ ఇండియా — 9.5 Cr
ఓవర్ సీస్  — 21 Cr
వరల్డ్ వైడ్ -   134.6 Cr

అంటే 140 కోట్లు షేర్ వస్తే బ్రేక్ ఈవెన్ అయ్యినట్లు. 

‘‘సినిమా అద్భుతంగా వచ్చింది. తమన్‌ మ్యూజిక్‌ మరోస్థాయిలో ఉండనుంది. ఫస్టాఫ్‌ రీరికార్డింగ్‌ పూర్తయింది. సంక్రాంతికి పర్‌ఫెక్ట్‌ మూవీ ఇది. ఫస్టాఫ్‌లో వచ్చే ఫైట్‌లో ఇద్దరు సూపర్‌స్టార్స్‌ను చూస్తున్న ఫీల్‌ కలుగుతుంది. చివరి 45 నిమిషాలు సినిమా అదిరిపోతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్స్‌ట్రా షోల కోసం ప్రయత్నిస్తున్నాం’’ అని నాగవంశీ ఇటీవల సోషల్‌ మీడియా చిట్‌చాట్‌లో తెలిపారు.  శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా .. యాక్షన్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాపై ఓ రేంజిలో అంచనాలు ఉన్నాయి.

‘‘చాలా కాలం నుంచి మహేశ్‌తో సినిమా చేయాలనుకుంటున్నా. ‘గుంటూరుకారం’తో అది నెరవేరింది. సినిమా అద్భుతంగా వచ్చింది. తమన్‌ మ్యూజిక్‌ మరోస్థాయిలో ఉండనుంది. ఫస్టాఫ్‌ రీరికార్డింగ్‌ పూర్తైంది. సంక్రాంతికి పర్‌ఫెక్ట్‌ మూవీ ఇది. ఫస్టాఫ్‌లో వచ్చే ఫైట్‌లో ఇద్దరు సూపర్‌స్టార్స్‌ను చూస్తున్న ఫీల్‌ కలుగుతుంది. చివరి 45 నిమిషాలు సినిమా అదిరిపోతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్స్‌ట్రా షోల కోసం ప్రయత్నిస్తున్నాం. థియేటర్ల జాబితా ఇంకా ఫైనల్‌ కాలేదు’’ అని ఆయన చెప్పారు.  
 
అతడు’, ‘ఖలేజా’ తర్వాత మహేశ్‌బాబు - త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రమిది. యాక్షన్‌ డ్రామాగా ఇది సిద్ధమవుతోంది. శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలు. జగపతి బాబు, జయరాం, ప్రకాశ్‌రాజ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ దీనిని నిర్మిస్తున్నారు.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios