Asianet News TeluguAsianet News Telugu

#Gunturkaaram ప్రీ రిలీజ్ ఈవెంట్ వెన్యూ మార్పు, హైదరాబాద్ లో మాత్రం కాదు?

 లాస్ట్ మినిట్ లో  ప‌ర్మిష‌న్లు దొరక్క  ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్య‌క్ర‌మం వాయిదా ప‌డింది.మళ్లీ ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తామని యూనిట్ వెల్లడించింది. ఈ మేరకు జనవరి 5వ తేదీ సాయంత్రం

Mahesh Babu #Gunturkaaram pre release event in Guntur? jsp
Author
First Published Jan 7, 2024, 1:33 PM IST


 మహేష్ బాబు కొత్త సినిమా గుంటూరు కారం.. జనవరి 6వ తేదీ హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు ముందుగానే ప్రకటించింది.. ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అనూహ్యంగా.. 24 గంటల ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దయినట్లు ప్రకటించటంతో ఫ్యాన్స్ అందరూ షాక్ అవుతున్నారు. లాస్ట్ మినిట్ లో  ప‌ర్మిష‌న్లు దొరక్క  ఈ కార్య‌క్ర‌మం వాయిదా ప‌డింది.మళ్లీ ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తామని యూనిట్ వెల్లడించింది. ఈ మేరకు జనవరి 5వ తేదీ సాయంత్రం సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది నిర్మాత సంస్థ.   త్వ‌ర‌లోనే కొత్త డేట్, కొత్త వేదిక వెల్ల‌డిస్తామ‌ని చిత్ర‌ టీమ్ ప్ర‌క‌టించింది.

అయితే ఈరోజు సాయింత్రం ట్రైల‌ర్ బ‌య‌ట‌కు వ‌దిలేస్తున్నారు. ఈ క్రమంలో  ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ పై అనుమానాలు వస్తున్నాయి. అయితే ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ గ్రాండ్ గా చేయ‌డానికి చిత్ర‌ టీమ్  అన్ని ర‌కాల ప్ర‌య‌త్నాలూ చేస్తోందని సమాచారం.మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈసారి గుంటూరులో ఈవెంట్ చేసే అవకాసం ఉంది. మొదట అసలు గుంటూరులోనే ప్రీ రిలీజ్ నుకున్నారు. కానీ హైదరాబాద్ కు మార్చారు. కానీ ఇప్పుడు జనవరి 9న గుంటూరులో ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌ర‌గొచ్చు. ప్ర‌స్తుతం ఆంధ్రాలో  ప‌ర్మిష‌న్ల కోసం ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నట్లు భోగట్టా. వెన్యూ  కూడా దాదాపుగా ఖ‌రారైపోయినట్లే అంటున్నారు. అయితే అంతా సెట్ అయ్యాకే అఫీషియల్ ప్రకటన వస్తుంది.  
 
మరో ప్రక్క 'చూడగానే మజా వస్తుంది, హార్ట్‌బీట్‌ పెరుగుతుంది, ఈల వేయాలనిపిస్తుంది. బ్లాక్‌బస్టర్‌ బొమ్మ లోడింగ్‌’ అని ‘గుంటూరు కారం’ (Guntur Kaaram)  నిర్మాత నాగవంశీ (Naga Vamsi)అంటున్నారు.ఈ సినిమాపై ధీమా వ్యక్తం చేశారు.   ‘‘సినిమా అద్భుతంగా వచ్చింది. తమన్‌ మ్యూజిక్‌ మరోస్థాయిలో ఉండనుంది. ఫస్టాఫ్‌ రీరికార్డింగ్‌ పూర్తయింది. సంక్రాంతికి పర్‌ఫెక్ట్‌ మూవీ ఇది. ఫస్టాఫ్‌లో వచ్చే ఫైట్‌లో ఇద్దరు సూపర్‌స్టార్స్‌ను చూస్తున్న ఫీల్‌ కలుగుతుంది. చివరి 45 నిమిషాలు సినిమా అదిరిపోతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్స్‌ట్రా షోల కోసం ప్రయత్నిస్తున్నాం’’ అని నాగవంశీ ఇటీవల సోషల్‌ మీడియా చిట్‌చాట్‌లో తెలిపారు.  శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా .. యాక్షన్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాపై ఓ రేంజిలో అంచనాలు ఉన్నాయి.

‘‘చాలా కాలం నుంచి మహేశ్‌తో సినిమా చేయాలనుకుంటున్నా. ‘గుంటూరుకారం’తో అది నెరవేరింది. సినిమా అద్భుతంగా వచ్చింది. తమన్‌ మ్యూజిక్‌ మరోస్థాయిలో ఉండనుంది. ఫస్టాఫ్‌ రీరికార్డింగ్‌ పూర్తైంది. సంక్రాంతికి పర్‌ఫెక్ట్‌ మూవీ ఇది. ఫస్టాఫ్‌లో వచ్చే ఫైట్‌లో ఇద్దరు సూపర్‌స్టార్స్‌ను చూస్తున్న ఫీల్‌ కలుగుతుంది. చివరి 45 నిమిషాలు సినిమా అదిరిపోతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్స్‌ట్రా షోల కోసం ప్రయత్నిస్తున్నాం. థియేటర్ల జాబితా ఇంకా ఫైనల్‌ కాలేదు’’ అని ఆయన చెప్పారు.  
 
అతడు’, ‘ఖలేజా’ తర్వాత మహేశ్‌బాబు - త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రమిది. యాక్షన్‌ డ్రామాగా ఇది సిద్ధమవుతోంది. శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలు. జగపతి బాబు, జయరాం, ప్రకాశ్‌రాజ్‌ తదితరులు కీలక పాత్రలు పోషి

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios