Asianet News TeluguAsianet News Telugu

‘మసాలా బిర్యానీ’సాంగ్ లీక్, ఊపేస్తోంది

.‘ఎదురొచ్చే గాలి ఎగరేస్తున్నా చొక్కా పైగుండీ.. ఎగబడి ముందరికే వెళ్లిపోతాది నేనెక్కిన బండి.. మసాలా బిర్యానీ’ అంటూ ఈ క్లిప్‌లో రిలిక్స్ వినిపస్తున్నాయి.
 

Mahesh babu #GunturKaaram Masala biryani song Leaked jsp
Author
First Published Nov 4, 2023, 8:40 AM IST


సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న కొత్త చిత్రం గుంటూరు కారం. ఈ సినిమా పై ఎక్సపెక్టేషన్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి. స్టార్ డైరక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సూర్య దేవర నాగవంశీ నిర్మాత. అనేక ఇంటర్వ్యూలో నాగవంశీ ఈ సినిమా అప్డేట్స్ పై చేసిన కామెంట్స్ సినిమా పై అంచనాలను రెట్టింపు చేసేసాయి. సంక్రాంతి కానుకగా గుంటూరు కారం సినిమాను విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ మూవీ పై భారీ బజ్ క్రియేట్ అవ్వడంతో.. సినిమా నుంచి అప్డేట్స్ ఎప్పుడు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు అభిమానులు. త్వరలోనే గుంటూరు కారం మూవీ ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయనున్నారు.

 అయితే ఈ లోగా ఈ చిత్రం నుంచి పాట లీక్ అయ్యి షాక్ ఇచ్చింది. ‘మసాలా బిర్యానీ’ అంటూ సాగే ఆ క్లిప్ క్యాచీగా బాగుంది. అంతేకాదు, ఇది థమన్ స్టైల్ లో అదరకొడుతోంది. ఆ క్లిప్ వైరల్ అవుతోంది.‘ఎదురొచ్చే గాలి ఎగరేస్తున్నా చొక్కా పైగుండీ.. ఎగబడి ముందరికే వెళ్లిపోతాది నేనెక్కిన బండి.. మసాలా బిర్యానీ’ అంటూ ఈ క్లిప్‌లో రిలిక్స్ వినిపస్తున్నాయి.

మరో ప్రక్క గుంటూరు కారం ఫ‌స్ట్ సింగిల్‌ను న‌వంబ‌ర్ ఫ‌స్ట్ వీక్‌లో త‌ప్ప‌కుండా రిలీజ్ చేస్తామ‌ని తెలిపాడు. పాట బాగా రావాల‌నే ఫ‌స్ట్ సింగిల్ రిలీజ్‌కు టైమ్ తీసుకుంటున్న‌ట్లు సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ చెప్పాడు. గుంటూరు కారం సినిమాకు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. అత‌డు, ఖ‌లేజా త‌ర్వాత మ‌హేష్‌బాబు, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న మూవీ ఇది.  గుంటూరు కారం సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఈ సినిమాలో మరో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటిస్తుంది. వచ్చే ఏడాది జనవరి 12న సినిమాను రిలీజ్ చేయండనికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.
 

Follow Us:
Download App:
  • android
  • ios