'గుంటూరు కారం' ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు ..అరాచకం
మహేష్ బాబు హీరోగా శ్రీలీల హీరోయిన్ గా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ చిత్రం “గుంటూరు కారం” . ఈ చిత్రం సాలిడ్ బిజినెస్ జరుపుతున్నట్టుగా తెలుస్తుంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా అంటేనే బిజినెస్ మామూలుగా ఉండదు. అలాంటిది మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ అంటే నెక్ట్స్ లెవిల్ లో ఉంది. ఈ సినిమా కు జరుగుతున్న ప్రీ రిలీజ్ బిజినెస్ పై ట్రేడ్ లో కథ లు కథలు గా చెప్పుకుంటున్నారు. హారిక, హాసిని బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాను 2024 జనవరి 13న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే రిలీజైన ఈ చిత్రం టీజర్ ఓ రేంజిలో క్రేజ్ తెచ్చుకుంది. మహేష్ బాబు ఎన్నడూ లేని విధంగా అవుట్ అండ్ మాస్ అవతార్ లో కనిపించటంతో సినిమాపై అంచనాలను అమాంతం పెరిగిపోయాయి. దానికి తోడు ఈ సినిమాలో.. హాట్ బ్యూటీ శ్రీలీల(Sreeleela), ఖిలాడీ బ్యూటీ మీనాక్షి చౌదరి(Meenakshi chaudary) హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం కు ఇప్పటివరకూ జరిగిన బిజినెస్ విషయాలకి వస్తే..
ఇప్పటికి ఈ చిత్రం ఓటిటి రికార్డు ఆఫర్ అందుకోగా ఇపుడు ఏరియా వైజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఊపందుకుంది. నైజాం ఏరియాలో 40 కోట్లకు దిల్ రాజు తీసుకున్నట్లు సమాచారం. ఇక . ఆంధ్ర 60 కోట్లు చెప్తున్నారు, అలాగే … సీడెడ్ 18Cr కు అడుగుతున్నారని వినికిడి. ఓవరాల్‌గా కొంచెం అటూ ఇటూలో సినిమా బిజినెస్ 120 కోట్ల రేంజ్‌లో క్లోజ్ వెళ్తుందని, వరల్డ్‌వైడ్‌గా 155 కోట్ల రేంజ్‌లో ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఓ రీజనల్ సినిమాతో ఈ రేంజ్ భారీ బిజినెస్ జరగడం అనేది రికార్డ్ అనే చెప్పాలి.
మరో ప్రక్క ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా స్దాయిలో రిలీజ్ చేసే ఆలోచన ఏమీ లేదని నిర్మాత నాగవంశీ తేల్చి చెప్పేసారు. అలాగే గుంటూరుకారం సంక్రాంతికి రావడం ఖాయం అని తేల్చేశారు. ఒక వేళ ఇంకే సినిమా ఆ టైంలో రిలీజ్ అయితే థియేటర్స్ సమస్య వస్తుంది తప్ప తమ సినిమాకి పోటీ కాదని అన్నారు. ఏ సినిమా అయిన వాయిదా పడుతుందేమో అనే ఉద్దేశ్యంతో అందరూ ముందుగానే స్లాట్ వేసి ఉంచుకుంటున్నారని తాను అనుకుంటున్నట్లు నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. జనవరి 11 నుంచి అమెరికాలో ప్రివ్యూలు ప్రారంభమవుతాయని నిర్మాత నాగవంశీ ఇటీవలే స్పష్టం చేశారు. సంక్రాంతి పండగ నేపథ్యంలో ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లోని సగానికి పైగా థియేటర్లను ఆక్రమించడం ఖాయమనేది నిజం.