ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రైట్స్ విలువ 135 కోట్లు కాగా, సినిమా 3 రోజుల్లో 56 శాతం రికవరీ అయింది. మరో 3 రోజుల పాటు ఇదే జోరును ఈ సినిమా కొనసాగించాల్సిన ..

గుంటూరు కారం తొలి ఆట నుంచే డివైడ్ టాక్ తెచ్చుకుంది. అయినా వ‌సూళ్ల‌లో మాత్రం ఓ రేంజిలో దూసుకుపోతుంది. దానికి తోడు హ‌నుమాన్ మిన‌హా మిగిలిన సంక్రాంతి సినిమాల‌కు నెగెటివ్ టాక్ రావ‌డం హ‌నుమాన్‌కు క‌లిసివ‌స్తోంది. మహేష్ బాబు ఛార్మ్,ఫ్యామిలీలలో ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా వర్కవుట్ అవుతోంది. దానికి తోడు త్రివిక్రమ్ మార్క్ సెంటిమెంట్ ఫ్యామిలీలకు నచ్చుతోంది. ఈ క్రమంలో గుంటూరు కారం ఫస్ట్ వీకెండ్ లో ప్రపంచవ్యాప్తంగా 76.64 కోట్ల రూపాయల షేర్ సాధించింది. 

ఏరియా వైజ్ వరల్డ్ వైజ్ కలెక్షన్స్ చూస్తే..

ఏరియా షేర్

నైజాం ₹ 25.1 Cr
సీడెడ్ ₹ 6.2 Cr
ఉత్తరాంధ్ర ₹ 6.1 Cr
గుంటూరు ₹ 6.24 Cr
ఈస్ట్ గోదావరి ₹ 5.32 Cr
వెస్ట్ గోదావరి ₹ 3.75 Cr
కృష్ణా ₹ 3.9 Cr
నెల్లూరు ₹ 2.23 Cr
AP/TS ₹ 58.84 Cr
రెస్టాఫ్ ఇండియా (Approx)₹ 5 Cr
ఓవర్ సీస్ ₹ 12.8 Cr

వరల్డ్ వైడ్ ₹ 76.64 Cr

ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాలలో 2వ రోజు కంటే 3వ రోజు బాక్సాఫీస్ కలెక్షన్లు ఎక్కువగా కనిపించాయి. అయితే నైజాంలో మాత్రం 3వ రోజు నుంచి సినిమా దాదాపు 20శాతం పడిపోయింది. ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రైట్స్ విలువ 135 కోట్లు కాగా, సినిమా 3 రోజుల్లో 56 శాతం రికవరీ అయింది. మరో 3 రోజుల పాటు ఇదే జోరును ఈ సినిమా కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ వీక్ ముగిసేనాటికి ఈ సినిమాకు 100 కోట్ల షేర్ వస్తుందని భావిస్తున్నారు. అయితే బడ్జెట్ పరంగా చూసుకుంటే, ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టం అంటోంది ట్రేడ్.

గుంటూరు కారం చిత్రంలో శ్రీలలో పాటు హీరోయిన్ మీనాక్షీ చౌదరి, ప్రకాష్‌రాజ్, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషించారు. హారిక అండ్‌ హాసినీ క్రియేషన్స్‌ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మించిన ‘గుంటూరు కారం’ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల అయ్యింది.. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత మహేష్‌బాబు-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రూపొందిన ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలేర్పడ్డాయి. మహేశ్‌ - త్రివిక్రమ్‌ స్టైల్ మాస్‌ అంశాలతో ఈ చిత్రం రూపొందింది.