నెట్టింట సెన్సేషన్ గా మారిన ‘కుర్చీ మడత పెట్టి’ ఫుల్ సాంగ్ రాబోతోంది. తాజాగా మేకర్స్ టైమ్ ఫిక్స్ చేశారు. ఈరోజే Kurchi Madatha Petti Song రాబోతోంది. ఎన్ని గంటలకంటే..?

13 ఏళ్ల తర్వాత సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వస్తున్న చిత్రం ‘గుంటూరు కారం’ (Guntur Kaaram). రెండు వారాల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్బంగా మేకర్స్ ప్రమోషన్స్ పై దృష్టి పెట్టారు. వరుసగా అప్డేట్స్ అందిస్తూ వస్తున్నారు. ఇప్పటికే పోస్టర్లు విడుదల చేశారు. సాంగ్స్ కూడా రిలీజ్ చేస్తూనే వస్తున్నారు. ఇప్పటికే ‘దమ్ మసాలా’, ‘హో మై బేబీ’ పాటలు విడుదలై ఆకట్టుకున్నాయి. 

మొన్న మూడోపాట కుర్చీ మడతపెట్టి (Kurchi Madatha Petti) ప్రోమోను విడుదల చేశారు. ఊహించని విధమైన లిరిక్స్, సాంగ్ టైటిల్ తో ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చారు. ప్రోమోకు ప్రస్తుతం నెట్టింట రచ్చ రచ్చ జరుగుతోంది. ఇక తాజాగా మేకర్స్ ఫుల్ సాంగ్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్ చేశారు. ఈ రోజు సాయంత్రం 4 : 05 నిమిషాలకు ప్రేక్షకుల ముందుకు రానుందని అధికారికంగా ప్రకటించారు.ప్రోమోనే దుమ్ములేపుతుండటంతో ఫుల్ సాంగ్ ఇంకెలా ఉంటుందని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. 

ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా యంగ్ సెన్సేషన్ శ్రీలీలా Sreeleela హీరోయిన్ గా నటిస్తోంది. హారిక అండ్ హాసిని బ్యానర్ పై నిర్మిస్తున్నారు. సెకండ్ హీరోయిన్ గా మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. 2024 జనవరి 12న సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా విడుదల కాబోతోంది.

Scroll to load tweet…