బాలీవుడ్ హీరోయిన్ కి ఝలక్ ఇచ్చిన మహేష్ బాబు, ముద్దు సీన్ తో రచ్చ.. డైరెక్టర్ కి ముఖం మీదే చెప్పేశాడు

సూపర్ స్టార్ మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణతో కలసి అనేక చిత్రాల్లో నటించారు. కానీ మహేష్ హీరోగా ఎంట్రీ ఇచ్చింది మాత్రం రాజకుమారుడు చిత్రంతోనే.

Mahesh Babu gives shock to Bollywood heroine and Director dtr

సూపర్ స్టార్ మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణతో కలసి అనేక చిత్రాల్లో నటించారు. కానీ మహేష్ హీరోగా ఎంట్రీ ఇచ్చింది మాత్రం రాజకుమారుడు చిత్రంతోనే. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. 

రాజకుమారుడుతో మహేష్ అరుదైన రికార్డ్ 

రాజకుమారుడు చిత్రంతో మహేష్ బాబు అరుదైన రికార్డ్ సాధించారు. డెబ్యూ చిత్రంతోనే 10 కోట్ల షేర్ రాబట్టిన తొలి హీరోగా మహేష్ నిలిచారు. రాజకుమారుడు చిత్రం 10 కోట్లకి పైగా షేర్ రాబట్టి సంచలన విజయం అందుకుంది. ఈ చిత్రంలో మహేష్ బాబుకి జోడీగా బాలీవుడ్ బ్యూటీ ప్రీతి జింటా నటించారు. ఆ చిత్రంలో మహేష్ బాబు నూనూగు మీసాల కుర్రాడు. 

హీరోయిన్ వాడిన స్ట్రా నాకు వద్దు 

రొమాంటిక్ సీన్లలో మహేష్ చాలా ఇబ్బంది పడ్డారట. ఒక సన్నివేశంలో ప్రీతి జింతా కూల్ డ్రింక్ తాగుతుంది. ఆమె తగిన స్ట్రాకి లిప్ స్టిక్ అవుతుంది. అదే స్ట్రాతో ముద్దు పెట్టుకున్న ఫీలింగ్ తో తర్వాత మహేష్ బాబు కూల్ డ్రింక్ తాగాలి అని రాఘవేంద్ర రావు వివరించారట. రాఘవేంద్ర రావుని మహేష్ మావయ్య అని పిలుస్తారట. 

Mahesh Babu gives shock to Bollywood heroine and Director dtr

రాఘవేంద్ర రావు ఆ సీన్ గురించి చెప్పగానే నేను చేయను మావయ్య నువ్వే చేసుకో అని దూరంగా వెళ్ళిపోయాడట. ఆమె ఎంగిలి చేసిన స్ట్రా నేను వాడటం ఏంటి అంటూ మహేష్ ప్రీతి జింతాకి అందరి ముందు ఝలక్ ఇచ్చారు. ఆ తర్వాత ఎలాగోలా ఒప్పించి ఆ సీన్ చేయించారట. 

మహేష్ బాబు లిప్ కిస్ సన్నివేశాలు 

అంతలా సిగ్గు పడిపోయే మహేష్ బాబు ఆ తర్వాత చిత్రాల్లో కొంతమంది హీరోయిన్లత్ లిప్ లాక్ సన్నివేశాల్లో కూడా నటించారు. బిజినెస్ మ్యాన్ చిత్రంలో కాజల్ తో, దూకుడు లో సమంతతో.. 1 నేనొక్కడినేలో కృతి సనన్ తో మహేష్ బాబు లిప్ లాక్ సన్నివేశాలు చేశారు. 

ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.  మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కబోయే గ్లోబల్ చిత్రానికి గ్లోబల్ బ్యూటీ హీరోయిన్ గా ఫిక్స్ అయింది. హాలీవుడ్ స్థాయిలో క్రేజ్ ఉన్న ప్రియాంక చోప్రాని రాజమౌళి.. మహేష్ చిత్రం కోసం ఫైనల్ చేశారు. పలు చర్చల తర్వాత ప్రియాంక చోప్రా ఈ చిత్రానికి ఓకె చెప్పిందట. ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలుచుకున్న ప్రియాంక చోప్రా బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

Mahesh Babu gives shock to Bollywood heroine and Director dtr

ఆఫ్రికన్ రచయిత విల్బర్ స్మిత్ రాసిన నవల ఆధారంగా రాజమౌళి ఫారెస్ట్ అడ్వెంచర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రాజమౌళి తనకి కావలసిన విధంగా విజయేంద్ర ప్రసాద్ తో కథ రాయించుకున్నారు. ఈ చిత్రానికి 1000 కోట్ల బడ్జెట్ అవసరం. రెండు భాగాల్లో తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. కెఎల్ నారాయణ దుర్గ ఆర్ట్స్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

హాలీవుడ్ స్థాయిలో మహేష్, రాజమౌళి మూవీ 

హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కించి ప్రపంచం మొత్తం రిలీజ్ చేయాలనేది రాజమౌళి ప్లాన్. దీని కోసం అంతర్జాతీయ టెక్నిషియన్స్ ని రాజమౌళి హైర్ చేసుకుంటున్నారు. కొన్ని అంతర్జాతీయ సంస్థలతో రాజమౌళి ఈ చిత్రం కోసం ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. డిస్ని లాంటి సంస్థలు తమ చిత్రాలని వరల్డ్ వైడ్ గా ఎలా మార్కెటింగ్ చేసుకుంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. అలాంటి సంస్థల్ని ఈ చిత్రంలో భాగస్వాములుగా చేస్తే హాలీవుడ్ లో కూడా రిలీజ్ చేయవచ్చు అనేది రాజమౌళి ప్లాన్. అందుకే డిస్ని, సోని లాంటి సంస్థల భాగస్వామ్యం ఈ చిత్రంలో ఉండొచ్చు అని అంటున్నారు. ఆ మేరకు ఒప్పందాలు జరుగుతున్నాయట. 

Also Read : జస్ట్ 50 వేలతో మొదలు, వందల కోట్లకి పడగెత్తిన కమెడియన్ అలీ.. స్టార్ హీరోలకు కూడా సాధ్యం కాని ఆస్తులు

Also Read : శంకర్ ఫీల్ అయినా పర్వాలేదు, రాంచరణ్ గురించి రాజమౌళి చెప్పింది నిజమే

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios