శంకర్ ఫీల్ అయినా పర్వాలేదు, రాంచరణ్ గురించి రాజమౌళి చెప్పింది నిజమే
డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ చిత్రంలో జనవరి 10 న బాక్సాఫీస్ వద్ద భారీ విస్ఫోటనానికి సిద్ధం అవుతోంది. ట్రైలర్ రిలీజ్ తర్వాత గేమ్ ఛేంజర్ పై అంచనాలు నెక్స్ట్ లెవల్ కి చేరిపోయాయి.
డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ చిత్రంలో జనవరి 10 న బాక్సాఫీస్ వద్ద భారీ విస్ఫోటనానికి సిద్ధం అవుతోంది. ట్రైలర్ రిలీజ్ తర్వాత గేమ్ ఛేంజర్ పై అంచనాలు నెక్స్ట్ లెవల్ కి చేరిపోయాయి. ఇక థియేటర్స్ లో శంకర్, రాంచరణ్ ఎలాంటి మ్యాజిక్ చేస్తారు, ఆడియన్స్ ని ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నారు అనే దానిపైనే గేమ్ ఛేంజర్ సక్సెస్ ఆధారపడి ఉంటుంది.
దర్శకధీరుడు రాజమౌళి చేతుల మీదుగా గేమ్ ఛేంజర్ ట్రైలర్ లాంచ్ అయింది. రాజమౌళి, శంకర్ ఇద్దరూ తమ చిత్రాలతో ఇండియన్ సినిమాపై ఎలాంటి ప్రభావం చూపారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాజమౌళి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ శంకర్ గురించి, రాంచరణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజమౌళి మాట్లాడుతూ ఇది శంకర్ గారి ఫస్ట్ స్ట్రైట్ తెలుగు సినిమా అంటే ఆశ్చర్యపోయా. ఎందుకంటే ఆయన గత చిత్రాలు తెలుగులో అద్భుతం చేశాయి. ఆయన తెలుగు డైరెక్టర్ ఎప్పుడో అయిపోయారు కదా అని అనుకున్నట్లు రాజమౌళి తెలిపారు.
తెలుగు ప్రేక్షకులకు, దర్శక నిర్మాతలకు శంకర్ అంటే అభిమానం మాత్రమే కాదు, గౌరవం కూడా అని రాజమౌళి అన్నారు. పాన్ ఇండియా సినిమాల విషయంలో అందరికీ శంకర్ గారు అందరికీ ఆదర్శం. మా దర్శకులకు ఆయన ఓజి అంటూ రాజమౌళి ప్రశంసలు కురిపించారు. ఒకే ఒక్కడు చిత్రం నా ఫేవరిట్ మూవీ. అందులో కాళ్ళు లేని వ్యక్తి అర్జున్ దగ్గరకి వచ్చి.. ఈ దేశం నాలాగే అవిటిది అయిపోయింది అన్నా.. నాయకుడివై నడిపించు అని అంటాడు. అది ఎంతో అద్భుతమైన షాట్. గేమ్ ఛేంజర్ పోస్టర్ లో అప్పన్న పాత్రలో చరణ్ ని చూస్తుంటే అలాగే అనిపిస్తోంది అని..ఒకే ఒక్కడు వైబ్స్ కనిపిస్తున్నాయి అని అన్నారు.
నా బ్రదర్ చరణ్.. కెరీర్ బిగినింగ్ నుంచి చాలా ఎదిగాడు. మగధీరలో చూసిన చరణ్ కి ఆర్ఆర్ఆర్ లో చూసిన చరణ్ కి చాలా మార్పు వచ్చింది.. ఎక్కడికో వెళ్ళిపోయాడు. చరణ్ ఎంత పెద్ద రేంజ్ కి వచ్చినట్లు నాకు చాలా సంతోషంగా ఉంది. చరణ్ కత్తి పట్టుకుని హెలికాప్టర్ నుంచి దిగుతూ గూస్ బంప్స్ తెప్పించగలడు.. అదే విధంగా ఫోన్ పట్టుకుని ఏడుస్తూ కన్నీళ్లు పెట్టించగలడు అని రాజమౌళి అన్నారు.
రాంచరణ్ - గుర్రం - రాజమౌళి అంటే డెడ్లీ కాంబినేషన్ అని చెప్పొచ్చు. మగధీరతో రాంచరణ్ హార్స్ రైడింగ్ సన్నివేశాలని రాజమౌళి అద్భుతంగా చిత్రీకరించారు. అదే విధంగా ఆర్ఆర్ఆర్ లో కూడా హార్స్ రైడింగ్ సీన్స్ ఉంటాయి. గేమ్ ఛేంజర్ ట్రైలర్ లో ఒక షాట్ లో చరణ్ తెల్ల గుర్రంపై కనిపించారు. దీనికి గురించి రాజమౌళి ఫన్నీగా కొన్ని కామెంట్స్ చేశారు. చరణ్ నువ్వు ఎప్పుడైనా హార్స్ రైడింగ్ సీన్స్ చేస్తే నా అనుమతి తీసుకోవాలి.. ఎందుకంటే ఆ సీన్స్ నావి. హార్స్ రైడింగ్ సీన్స్ లో చరణ్ ని తాను చూపించినట్లుగా ఇంకెవరూ చూపించలేరు అని అర్థం వచ్చేలా రాజమౌళి కామెంట్స్ చేశారు. దీనితో రాంచరణ్ కూడా నవ్వుకున్నారు.
రాజమౌళి వెంటనే వేదికపై ఉన్న శంకర్ కి కూడా సారీ సార్ అని చెప్పారు. శంకర్ ఫీల్ అయినా రాజమౌళి చెప్పింది నిజమే అని ఫ్యాన్స్ అంటున్నారు. హార్స్ రైడింగ్ సీన్స్ తెరకెక్కించాలి అంటే జక్కన్నకి మాత్రమే సాధ్యం అని అంటున్నారు.