సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల 'భరత్ అనే నేను' చిత్రంతో సక్సెస్ అందుకున్నారు. తన తదుపరి సినిమా దర్శకుడు వంశీ పైడిపల్లితో చేయనున్నాడు మహేష్. అయితే దీని తరువాత సుకుమార్ లైన్ లో ఉన్నారు. ప్రస్తుహం తన సొంతూరులో ఉన్న సుకుమార్ త్వరలోనే మహేష్ సినిమా కోసం కథను సిద్ధం చేయబోతున్నాడు. 'రంగస్థలం' సినిమా మాదిరి మహేష్ తో చేయబోయే సినిమా కూడా డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ తో ఉంటుందని సుకుమార్ అన్నారు.

నిజానికి సుకుమార్.. మహేష్ కు ఒక లైన్ మాత్రమే చెప్పారట. అది ఆసక్తికరంగా అనిపించడంతో ఆయన పూర్తి కథను సిద్ధం చేయమని చెప్పారట. ఈ సినిమాకు కూడా సుకుమార్ స్నేహితుడు టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించనున్నారు. గతంలో మహేష్-సుకుమార్ కాంబినేషన్ లో 'వన్ నేనొక్కడినే' సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ఫ్లాప్ అయింది. మరి ఈసారైనా మహేష్ కు హిట్ ఇస్తాడేమో చూడాలి!