'భరత్ అనే నేను'   తరువాత.. మహేష్ బాబు చేస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం మహర్షి.  ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.  ఈ సినిమా రిలీజ్ అవటానికి మరో  నెల‌రోజుల స‌మ‌యం మాత్ర‌మే మిగిలి ఉంది. అయితే ఇంకా  స‌రైన ప్ర‌మోష‌న‌ల్ మెటీరియ‌ల్ ఏదీ బ‌య‌ట‌కు వదలలేదు.  

మ‌హేష్ స్టూడెంట్  గెట‌ప్ లో ఉన్న ఫొటో త‌ప్ప వేరొక ఫోటో బయిటకు రాలేదు. అపడదడపా  లీక్డ్ పోటోలు కొన్ని ఇంటర్నెట్ లో హ‌ల్ చ‌ల్ చేసి ఫ్యాన్స్ కు ఆనందం కలగచేయటం తప్ప వేరేవి లేవు. దాంతో మహేష్ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఇంకా చెప్పాలంటే ఎప్పుడు ప్రమోషన్ మెటీరియల్ వస్తుందా ...దాన్ని ప్రమోట్ చేద్దాం..తమ హీరో సినిమాకు క్రేజ్ తెద్దాం అని ఎదురుచూపుల్లో ఉన్నారు. ఈ విషయమై సోషల్ మీడియాలో పోస్ట్ లు పడుతున్నాయి.  `మ‌హర్షి` టీమ్ తమ ఉత్సాహం గమనించాలని డైరక్టర్ ని, నిర్మాణ సంస్దని ట్యాగ్ చేస్తూ రిక్వెస్ట్ లు చేస్తున్నారు. 

ఈ నేపధ్యంలో  ఈ ఉగాదికి మ‌హ‌ర్షి సినిమాకి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్ ని లాంచ్ చేస్తార‌ని ఫ్యాన్స్ అంచ‌నా వేస్తున్నారు. అందుకు ఇందుకు  సంబంధించి నిర్మాత‌ల నుంచి అధికారిక ప్ర‌క‌న‌ట‌న ఏమీ రాలేదు. మరికొందరు అభిమానులు ఏప్రిల్ 6న ఉగాది సంద‌ర్భంగా ఏదైనా టీజర్ కాదు కానీ సినిమాకు సంభందించి  కొత్త లుక్ తో పోస్టర్  రిలీజ్ చేస్తారని భావిస్తున్నారు.  

ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు- పీవీపీ- అశ్వ‌నిద‌త్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఏప్రిల్ రెండో వారం  నాటికి సినిమా షూటింగ్  పూర్త‌వుతుంది. మే9న ప్ర‌తిష్ఠాత్మ‌కంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి.  మహేష్ బాబు 25 వ సినిమాగా వస్తున్న మహర్షిలో మహేష్ కు జోడిగా పూజా హెగ్డే నటిస్తోంది.  వంశి పైడిపల్లి దర్శకుడు.